Telugu News » FARMER : సాగర్ నీళ్లు ఖమ్మంకు తరలింపు..రేవంత్ సర్కారుపై యువ‌‌ రైతు ఆగ్రహం..!

FARMER : సాగర్ నీళ్లు ఖమ్మంకు తరలింపు..రేవంత్ సర్కారుపై యువ‌‌ రైతు ఆగ్రహం..!

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కరువు పరిస్ధితులు నెలకొన్నాయి.దీంతో అన్నదాతలు(Farmer) ఆవేదన చెందుతున్నారు. వేసిన పంటలు వేసినట్టే ఎండిపోతున్నాయని, ఆఖరు తడికి నీటిని అందించాలని రేవంత్ సర్కారు

by Sai
Sagar water transfer to Khammam.. Young farmers are angry with Revanth government..!

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కరువు పరిస్ధితులు నెలకొన్నాయి.దీంతో అన్నదాతలు(Farmer) ఆవేదన చెందుతున్నారు. వేసిన పంటలు వేసినట్టే ఎండిపోతున్నాయని, ఆఖరు తడికి నీటిని అందించాలని రేవంత్ సర్కారు(Cm Revanth reddY)కు వారు విజ్ఞప్తి చేస్తున్నారు.కానీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు. దీంతో ఓ యువరైతు తాజాగా ప్రభుత్వం మీద, సొంత జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల మీద సీరియస్ అయ్యాడు.

Sagar water transfer to Khammam.. Young farmers are angry with Revanth government..!

 

https://x.com/TeluguScribe/status/1775769515709636860

ఒక్క తడికి నీళ్లు ఇవ్వండని ఇక్కడి రైతులు మొరపెట్టుకున్నా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సర్కారుపై ఓ యువరైతు ఫైర్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నేరేడు చేర్ల మండలం పత్తేపురం గ్రామం వద్ద పాలకవీడు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన పేరుమల సతీశ్ అనే యువరైతు సాగర్ నీటి విడుదలపై మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలో రైతు వెనుకాల ఉన్న కాలువలో నుంచి పారుతున్న నీటి తమ ప్రయోజనాల కోసం కాకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగర్ నీటిని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని ఆరోపించారు. కాలువ ప్రతిగేటు వద్ద పోలీసులు, తహశీల్దార్లను కాపలాగా ఉంచి కాంగ్రెస్ సర్కారు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖమ్మంకు తరలించడం ఏంటని ప్రశ్నించాడు.

ప్రతిగ్రామంలో పశువులు తాగడానికి చెరువుల్లో సైతం నీళ్లు లేవని, గ్రౌండ్ వాటర్ లేక గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొన్నదన్నారు. మంత్రులు ఉత్తమ్, కోమటి రెడ్డి వెంకరెడ్డి తమ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆఖరు తడికి నీళ్లివ్వడం లేదని యువరైతు వాపోయాడు. 15 ఎకరాల్లో పంట వేసినా అర ఎకరం కోసే పరిస్థితులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేశాడు.

 

You may also like

Leave a Comment