Telugu News » Political Revenge : ఖమ్మంలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. కర్రలు, కత్తులతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల పరస్పర దాడి!

Political Revenge : ఖమ్మంలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. కర్రలు, కత్తులతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల పరస్పర దాడి!

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ కక్షలు (POlitical Revenge) ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఉగాది పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన ఓ ఊరేగింపు కార్యక్రమంలో పాత కక్షలను మనసులో పెట్టుకుని బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) వర్గాలు పరస్పరం దాడులు(Physical Attacks) చేసుకోగా ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

by Sai
Divided political factions in Khammam.. BRS and Congress leaders attacked each other with sticks and knives!

వివరాల్లోకివెళితే.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ పరంగా పాత కక్షలు చాలా కాలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో చాలా దందాలకు పాల్పడగా ఆ టైంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తూ వచ్చేవారు. దీంతో ఇరువర్గాలకు మధ్య చాలా కాలంగా రీవెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఉగాది పండగ సందర్బంగా పండితాపురం గ్రామంలో రాత్రి ఏండ్ల బండ్లపై ప్రభ ఊరేగింపులో సమయంలో రెండు పార్టీల మధ్య చెలరేగిన వివాదం చెలరేగింది.
దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వర్గీయులు ఒకరిపై ఒకరు కత్తులు,కర్రలతో దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలవ్వగా.. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడి కారు ధ్వంసం కావడంతో పాటు అతనికి ,పలువురు కాంగ్రెస్స్ నేతలకు గాయాలైనట్లు తెలిసింది.

గాయాలపాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరిస్థితి శృతి మించకుండా ఉండేందుకు ప్రస్తుతం పండితాపురం గ్రామంలో 144 సెక్షన్ విధించారు.గత రాజకీయ పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్లు పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment