Telugu News » Reservations : రిజర్వేషన్స్‌తో తీవ్రంగా నష్టపోతున్నాం.. జనరల్ కేటగిరి విద్యార్థుల ఆవేదన!

Reservations : రిజర్వేషన్స్‌తో తీవ్రంగా నష్టపోతున్నాం.. జనరల్ కేటగిరి విద్యార్థుల ఆవేదన!

దేశవ్యాప్తంగా రిజర్వేషన్స్ (Reservations) అమలుతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని జనరల్ కేటగిరి(Jen Category Students) విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కాంపిటేటివ్ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్స్ అమలవుతుండటంతో మెరిట్ విద్యార్థులకు తీవ్రంగా నష్టం(loss) వాటిల్లుతోందని విద్యార్థులు చెబుతున్నారు.

by Sai
We are losing heavily due to reservations.. General category students are suffering

దేశవ్యాప్తంగా రిజర్వేషన్స్ (Reservations) అమలుతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని జనరల్ కేటగిరి(Jen Category Students) విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కాంపిటేటివ్ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్స్ అమలవుతుండటంతో మెరిట్ విద్యార్థులకు తీవ్రంగా నష్టం(loss) వాటిల్లుతోందని విద్యార్థులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కాంపిటీషన్ తీవ్రంగా పెరిగింది. జనరల్ కేటగిరిలో ఒక్క సీటుకు వంద నుంచి వెయ్యి మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

We are losing heavily due to reservations.. General category students are suffering

ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ఇదే ప్రక్రియను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. రిజర్వేషన్స్ అనేవి వ్యక్తి స్తోమతను, ఆదాయ మార్గాలను చూసి ఇవ్వాలని కానీ విద్యావ్యవస్థలో ఎందుకు అని పలువురు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. యూనిఫాం అనేది విద్యావ్యవస్థలో ఉన్నప్పుడు.. రిజర్వేషన్స్ అమలు దేనికి అని ప్రశ్నిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వాలు చదువుకు సాయం చేయాలి.

కానీ, ర్యాంకులకు రిజర్వేషన్‌ను ముడిపెట్టడం వలన మెరిట్ జాబితాలో ఉన్న విద్యార్థులు విపరీతమైన కాంపిటీషన్ వలన తమ ఉన్నత లక్ష్యాలను అందుకోలేకపోతున్నారని, ముఖ్యంగా జనరల్ కోటాలోని సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులే తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.రిజర్వేషన్ ఉన్న విద్యార్థులకు అరకొర ర్యాంకులు వచ్చినా వారికి పెద్ద యూనివర్సిటీల్లో ప్లేస్ మెంట్స్ దొరకుతున్నాయని, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ఇదే జరుగుతోందని వాపోతున్నారు.

తాజాగా ఇదే అంశంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందేందుకు రిజర్వేషన్స్ చూడొద్దనే అంశం తెరపైకి వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన బెంగళూరు IISCలో బీఎస్సీ అడ్మిషన్స్ కోసం ప్రకటించిన కటాఫ్ వలన జనరల్ కేటగిరీ వారికి అన్యాయం జరుగుతుందని అంటున్నారు.
జనరల్ విద్యార్థులకు 1-250 ర్యాంకులు వస్తేనే IISCలో సీటు వస్తుంది. అదే ఓబీసీకి 1-6000 మధ్యలో ర్యాంకు ఉండాలి.ఎస్సీకి 1-8000, ఎస్టీకి 1-50000ల మధ్యలో ర్యాంకు వచ్చినా సీటు లభిస్తుంది. అందుకే ఈ రిజర్వేషన్ల ప్రక్రియపై ప్రభుత్వాలు పున: సమీక్షించాలని విద్యార్థి సంఘాల నేతలు, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కోరుతున్నారు.

You may also like

Leave a Comment