పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)పై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్బంగా శనివారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆయన చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి(BRS Nagar kurnool Mp Candidate) గా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన బీఎస్పీస్టేట్ చీఫ్ పదవికి రాజీనామా చేసి గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో పలు సంచనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పేరు గాంచిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు.
🔷 మన బీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
🔹సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
🔹నల్లమల ప్రాంతంలో పుట్టిన ప్రవీణ్ కుమార్ గారు తన 6 ఏళ్ల పదవి కాలాన్ని వదులుకొని బడుగు… pic.twitter.com/rRv74Ludan
— KTR (@KTRBRS) April 20, 2024
నల్లమల ప్రాంతంలో పుట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఆరేళ్ల పదవీ కాలాన్ని వదులుకుని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బహుజనవాదాన్ని భుజాన ఎత్తుకుని ప్రజాసేవలోకి అడుగుపెట్టారని కొనియాడారు.
తన పదవీ కాలంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు, మార్పులకు శ్రీకారం చుట్టారని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఆద్యులని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఐక్యరాజ్యసమితి కోసం ఒకప్పటి యుగోస్లావియాలో కూడా పనిచేశారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. ప్రవీణ్ కుమార్ గళం నాగర్ కర్నూల్‌కు బలం అని.. అందుకే కారు గుర్తుకు ఓటేసి ఆయన్ను గెలిపించాలని కేటీఆర్ ఓటర్లకు సూచించారు.