భారీ వర్షాల కారణంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 118 మంది ఖైదీలు(Prisoners) జైలు నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన నైజీరియా(NIGERIA) దేశంలోని రాజధాని అబూజ సమీపంలో గల సులేజాలో చేటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే, గత కొద్ది రోజులుగా నైజీరియాలో భారీ వర్షాలు(HEAVY RAINS) కురుస్తున్నాయి.
దీంతో పట్టణంలోని జైలు ప్రహరీతో పాటు పలు భవనాలు సైతం దెబ్బతిన్నాయి. ఇదే అదనుగా భావించిన 118 మంది ఖైదీలు జైలు నంచి పరారయ్యారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పారిపోయిన వారి గురించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 10 మంది ఖైదీలను తిరిగి అాదుపులోకి తీసుకున్నారు.
మిగిలిన వారికోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.కాగా, తప్పించుకున్న వారి జాబితాలో ఎవరెవరు ఉన్నారనే విషయం బయటకు రాలేదు. గతంలో ఇదే జైలులో బోకో హరమ్ గ్రూమ్ సభ్యులను బంధించారు. పరారైన వారిలో వారుకూడా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నైజీరియాలో జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోవడం ఇదేమీ కొత్తకాదు. ఉగ్రవాదుల దాడులు, వసతుల లేమి కారణంగా ఈ మధ్యకాలంలో జైలు నుంచి ఖైదీలు పారిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. 2022లో జులైలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే అబూజా జైలు నుంచి సుమారు 600 మంది ఇస్లామిక్ స్టేట్ ఖైదీలు పరారైన విషయం తెలిసిందే.కాగా, అందులో తిరిగి 300 మంది ఖైదీలను పోలీసులు పట్టుకున్నారు.