తెలుగుదేశం(TDP) పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chnadrababu Naidu) అరెస్ట్‌పై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్(HArshakumar_) స్పందించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కక్షసాధింపు చర్యలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సీఐడీ అధికారులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఏడుపదులు దాటిన వయస్సులో చంద్రబాబును అక్రమ కేసులతో జైలుకు పంపించడం ఏమాత్రం సహేతుకం కాదన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని హింసించి, వేధించడంపై మండిపడ్డారు. ఓ మానసిక రోగి సంతృప్తి కోసం కొన్ని వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో అనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని అన్నారు.
నంద్యాలలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి విజయవాడలో రోజంతా విచారించడం ఇవన్నీ చూస్తుంటే బాధేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడుకు దాదాపు అరవై గంటలు నిద్రలేకుండా చేశారని మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
బీజేపీ, వైసీపీ ఒక్కటేన్నది ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మద్దతుగా ఉంటామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తెలిపారు.