Telugu News » వణికిస్తున్న స్క్రబ్ టైపస్ వ్యాధి…. ఒడిశాలో ఐదుగురు… సిమ్లాలో తొమ్మిది మంది మృతి….!

వణికిస్తున్న స్క్రబ్ టైపస్ వ్యాధి…. ఒడిశాలో ఐదుగురు… సిమ్లాలో తొమ్మిది మంది మృతి….!

ఈ వ్యాధి బారిన పడి ఒడిశాలో ఐదుగురు, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో తొమ్మిది మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు

by Ramu
Scrub Typhus kills 5 in Odisha 9 in Shimla

దేశంలో ఓ వైపు నిపా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే కేరళలో కంటైన్ మెంట్ జోన్లను ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇది ఇలా వుంటే మరో వైపు ప్రాణాంతక స్క్రబ్ టైపస్ వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారిన పడి ఒడిశాలో ఐదుగురు, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో తొమ్మిది మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

Scrub Typhus kills 5 in Odisha 9 in Shimla

ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లా వైద్యాధికారి సాధు చరణ్ మాట్లాడుతూ….. ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి రాష్ట్రంలో ఐదుగురు మరణించినట్టు వెల్లడించారు. ఇందులో సోహెలా బ్లాక్ లో ఇద్దరు మరణించారని చెప్పారు. అత్తాబిరా, భేడెన్, బర్పాలి బ్లాక్‌ల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్టు వెల్లడించారు.

ఇక సిమ్లాలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య అధికంగా వున్నట్టు అధికారులు తెలిపారు. స్క్రబ్ టైఫా లక్షణాలతో చాలా మంది ఇందిరా గాంధీ మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో చేరుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 300 మంది వరకు ఈ వ్యాధి బారిన పడినట్టు అధికారులు వివరించారు.

స్క్రబ్ టైఫస్ అనేది ఒక అంటు వ్యాధి. ఓరియంటియా సుత్సుగముషి అని పిలువబడే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒక పురుగు కాటు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని అంటున్నారు. ఇది ఎక్కువగా గడ్డి, పొదలు, ఎలుకలు, కుందేళ్ళు, ఉడుతలు వంటి జంతువుల శరీరాలపై కనిపిస్తుందని చెబుతున్నారు.

ఈ వ్యాధి బారిన పడిన వారిలో తీవ్ర జ్వరం, తల నొప్పి, పొడి దగ్గు, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, శరీరంపై ఎర్రటి మచ్చలు, కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. కొన్ని సార్లు జీర్ణాశయ సమస్యలు, క్లోమం, ప్లీహాం సరిగా పని చేయకపోవడం వంటి సమస్యలు కలిగే అవకాశం ఉందంటున్నారు.

ఈ వ్యాధి బారిన పడిన వారిలో పది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. ఒక వేళ రోగికి సరైన చికిత్స అందించక పోతే శరీరంలోని పలు అవయవాలు పని చేయకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు. దీంతో చివరకు రోగి మరణించే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

You may also like

Leave a Comment