పార్లమెంట్(Parliament) నూతన భవనం(New building) వద్ద ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్(Jagadeep dhankad)ఈ రోజు జాతీయ జెండాను(Naitonal flag) ఎగుర వేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగా జాతీయ జెండాను ధనఖడ్ ఆవిష్కరించారు.
ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు అని ధన్ ఖడ్ అన్నారు. భారత సేవలు, శక్తి సామర్థ్యాలను ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోందన్నారు. మనం కలలో కూడా ఊహించని అభివృద్ధి, విజయాలను చూస్తున్న కాలంలో జీవిస్తున్నామని అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరి వంశ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు.
వారితో పాటు కేంద్ర మంత్రులు అర్జున్ రాం మేఘ్ వాల్, వీ మురళీధరన్, కాంగ్రెస్ ఎంపీలు అధీర్ రంజర్ చౌదరి, ప్రమోద్ తివారీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే గైర్హాజరు అయ్యారు. ఈ కారక్రమానికి తాను హాజరు కాలేనని ఖర్గే ముందుగానే వెల్లడించారు. తనకు ఆహ్వాన లేఖ చాలా ఆలస్యంగా అందడంపై తాను నిరాశ చెందినట్టు లోక్ సభ సెక్రటరీ జనరల్ కు ఆయన లేఖ రాశారు.
అంతకు ముందు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ రాకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరిని మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన ఫైర్ అయ్యారు. పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను పనికి రాకపోతే చెప్పండని, తాను వెళ్లిపోతానన్నారు. ముందు కార్యక్రమానికి వచ్చిన వారిపై దృష్టి పెట్టండన్నారు.