Telugu News » Crime : చక్రవడ్డీ కోసం చిత్రహింసలు…మాజీ హోంగార్డు మృతి!

Crime : చక్రవడ్డీ కోసం చిత్రహింసలు…మాజీ హోంగార్డు మృతి!

తీసుకున్న లక్ష రూపాయలకు వడ్డీ క్రమం తప్పకుండా కట్టేవాడని, అయినా కూడా తమ కుమారుడ్ని చక్రవడ్డీ ఇవ్వాలంటూ ఫైనాన్సియర్ సలీం డిమాండ్ చేసేవాడు.

by Prasanna
Home guard 1

హైదరాబాద్ లోని ఐఎస్‌ సదన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. వడ్డీతో సహా అప్పుతీర్చినా కూడా చక్రవడ్డీ డిమాండ్ చేస్తూ…ఫైనాన్సియర్ తమ కుమారుడిని కిడ్నాప్ చేసి కొట్టి చంపేశారని మాజీ హోంగార్డ్ రిజ్వాన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రిజ్వాన్ తల్లిదండ్రులు ఏమన్నారంటే…

Home guard 1

మా అబ్బాయి రిజ్వాన్ ఆర్థిక అవసరాల కోసం  సలీం అనే ఫైనాన్షియర్ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న లక్ష రూపాయలకు వడ్డీ క్రమం తప్పకుండా కట్టేవాడని, అయినా కూడా తమ కుమారుడ్ని చక్రవడ్డీ ఇవ్వాలంటూ ఫైనాన్సియర్ సలీం డిమాండ్ చేసేవాడు. చక్రవడ్డీ కోసం సలీం వేధింపుల ఎక్కువ కావడంతో రిజ్వాన్.. సలీం ఇచ్చిన డబ్బులన్నీ వడ్డీతో సహా చెల్లించాడు. అప్పు మొత్తం తీరిపోయిందంటూ రిజ్వాన్ అనుకున్నాడు. కానీ, సలీం మాత్రం చక్రవడ్డీ ఇవ్వాలి అంటూ వేధింపులు మొదలుపెట్టాడు.

చక్రవడ్డి ఇవ్వలేదని నాంపల్లికి చెందిన ఓ ముఠా ఐఎస్ సదన్ నుంచి కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ భవనంలో రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేశారు. మాకు ఫోన్ చేయించి రూ. 10 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేం రూ. 2 లక్షలు ఇచ్చి రిజ్వాన్ ను విడిపించుకున్నాం. అప్పటికే 15 మందికి పైగా వ్యక్తులు 2 రోజుల పాటు మద్యం తాగి తమ బిడ్డను కొట్టారు అని రిజ్వాన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

వారు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకపోవడంతో ఇంటికి తీసుకొచ్చిన తరువాత రిజ్వాన్ ను ఒవైసీ హాస్పిటల్ లో జాయిన్ చేశాం. కానీ చికిత్స పొందుతూ మా కుమారుడు మరణించాడు. దాంతో మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం.

రిజ్వాన్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment