Telugu News » Woman Reservation Bill: లోక్ సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు… మోడీ కీలక వ్యాఖ్యలు….!

Woman Reservation Bill: లోక్ సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు… మోడీ కీలక వ్యాఖ్యలు….!

మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ రోజు లోక్ సభ ముందుకు వచ్చింది.

by Ramu
Womens Reservation Bill tabled in Lok Sabha

మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ రోజు లోక్ సభ ముందుకు వచ్చింది. పార్లమెంట్ నూతన భవనంలో ఈ బిల్లును లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్ వాల్ (Arjun Meghwal) ప్రవేశ పెట్టారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల (Reservtions) ను ఈ బిల్లు కల్పించనుంది. అన్ని పార్టీల మద్దతు ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు త్వరగానే ఆమోదం లభించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

Womens Reservation Bill tabled in Lok Sabha

బిల్లు ప్రవేశ పెట్టిన సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్ నూతన భవనంలో ఈ చారిత్రాత్మక సందర్భంలో సభ మొదటి ప్రొసీడింగ్ గా పార్లమెంట్ సభ్యులంతా మహిళా శక్తికి ద్వారాలను తెరెచేలా ఈ కీలక నిర్ణయంతో శ్రీకారం చుడుతున్నామని మోడీ చెప్పారు. మహిళల సారథ్యంలోని అభివృద్ధి నిర్ణయాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు తమ ప్రభుత్వం ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకు వచ్చిందన్నారు.

లోక్ సభ, రాజ్య సభలో మహిళా సభ్యత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకు వస్తున్నామని మోడీ వివరించారు. ‘నారీ శక్తి వందన్ అభినయం’ అనేది తదుపరి మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ పై సుదీర్ఘకాలంగా చర్చ జరుగుతోందన్నారు. ఈ బిల్లును అటల్ బిహారీ వాజ్ పాయ్ హయాంలో పలు మార్లు బీజేపీ ప్రవేశ పెట్టిందన్నారు.

కానీ తగినంత మెజారిటీ లేక పోవడంతో బిల్లుకు ఆమోదం లభించలేదన్నారు. అందువల్ల ఈ స్వప్నం అసంపూర్తిగా మిగిలిపోయిందన్నారు. ఈ రోజు ఆ బిల్లును ముందుకు తీసుకు వెళ్లే అవకాశం తనకు భగవంతుడు ఇచ్చాడన్నారు. ఈ రోజు ఉభయ సభల్లో తమ ప్రభుత్వం దీనికి సంబంధించి నూతన బిల్లును తీసుకు వస్తోందని ఆయన వెల్లడించారు.

You may also like

Leave a Comment