Telugu News » Sonia Gandhi : 13 ఏండ్లు ఆగాం.. ఇంకెంత కాలం ఆగాలి…. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ…!

Sonia Gandhi : 13 ఏండ్లు ఆగాం.. ఇంకెంత కాలం ఆగాలి…. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ…!

స్థానిక సంస్థ ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు రాజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణ తీసుకు వచ్చారని చె్పారు.

by Ramu

మహిళా రిజర్వేషన్ (Woman Reservation ) బిల్లుకు మద్దతిస్తామని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi) వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్ధతిస్తోందని చెప్పారు. ఈ బిల్లును తీసుకు రావడంతో రాజీవ్ గాంధీ (RAjiv Gandhi) స్వప్పం నెరవేరిందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రాజీవ్ గాంధీ రిజర్వేషన్‌ కల్పించారని వెల్లడించారు. ఈ బిల్లును తక్షణమే అమలులోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు.

Congress backs nari shakti bill but quota should be effective immediately

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్బంగా బిల్లుపై సోనియా గాంధీ మాట్లాడారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు రాజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణ తీసుకు వచ్చారని చె్పారు. కానీ రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో ఆ బిల్లు వీగిపోయిందని ఆమె తెలిపారు.

ఆ తర్వాత ప్రధాని పీవీ నరసింహరావు నాయకత్వంలో ఆ బిల్లును ఆమోదించామన్నారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 15 లక్షల మంది మహిళా ప్రతినిధులు ఇప్పుడు వున్నారని చెప్పారు. రాజీవ్ గాంధీ కలలు అసంపూర్తిగా నెరవేరాయన్నారు. ఈ బిల్లు ఇప్పుడు ఆమోదం పొందితే రాజీవ్ గాంధీ స్వప్నం పూర్తిగా నెరవేరుతుందన్నారు.

భారతీయ మహిళలకు మహాసముద్రమంత ఓపిక ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరి అభివృద్ది కోసం ఒక నదిలాగా స్త్రీ కష్టపడుతుందన్నారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతు తెలుపుతోందన్నారు. కానీ తమకు ఇంకా కొన్ని ఆందోళనలు వున్నాయన్నారు. భారతీయ మహిళలు తమ రాజకీయ బాధ్యతల కోసం 13 ఏండ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. మళ్లీ ఇప్పుడు మరికొంత కాలం ఆగాలంటున్నారని ఆమె అన్నారు. ఇప్పుడు ఈ బిల్లు అమలు కోసం ఇంకెంత కాలం వేచి వుండాలని ప్రశ్నించారు. భారతీయ మహిళల పట్ల ఇలాంటి పద్దతి సరైనదేనా అని ఆమె నిలదీశారు.

You may also like

Leave a Comment