Telugu News » తెలంగాణ వచ్చాకే వారికి తగిన గౌరవం వచ్చింది: ఎర్రబెల్లి!

తెలంగాణ వచ్చాకే వారికి తగిన గౌరవం వచ్చింది: ఎర్రబెల్లి!

గ‌తంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన మ‌న దేవాల‌యాలు, మ‌న క‌వులు, క‌ళాకారుల‌కు తెలంగాణ వ‌చ్చాకే..త‌గిన గౌర‌వం, గుర్తింపు ద‌క్కింది.

by Sai
the-development-of-temples-was-under-cm-kcr-rule-says-minister-errabelli

వ‌రంగ‌ల్ న‌గ‌రంలో రూ.3 కోట్ల వ్య‌యంతో 1040 చ‌ద‌ర‌పు గ‌జాల‌ విస్తీర్ణంలో నాలుగు అంత‌స్తుల భ‌వ‌నాన్ని దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, ప్రణాళిళా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… నేడు ధార్మిక భవన్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

the-development-of-temples-was-under-cm-kcr-rule-says-minister-errabelli

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..సర్వే నెంబర్.725 ఓపెన్ ల్యాండ్‌లో సెంట్రల్ జైలు, వరంగల్ ఎదురుగా 1014 చదరపు గజాలలో దేవాదాయ శాఖ కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టారు. నేడు దేవాదాయ శాఖ సమీకృత భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాలుగు అంతస్తులతో నిర్మించిన ఈ భవనంలో మొదటి అంతస్తులో డిప్యూటీ కమిషనర్, ఎండోమెంట్స్, వరంగల్ జోన్, రెండవ అంతస్తులో అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్స్, వరంగల్,

మూడవ అంతస్తులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎండోమెంట్స్, వరంగల్, నాలుగవ అంతస్తులో ఈ.ఓ., శ్రీసమ్మక్క- సారలమ్మ జాతర, మేడారం కార్యాలయాలు ఉంటాయన్నారు. ఇవన్నీ ఒకే చోట ఉండడం వల్ల పరిపాలన సౌలభ్యమే కాక సందర్శకులకు వివిధ పనుల మీద వచ్చే వాళ్లందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

గ‌తంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన మ‌న దేవాల‌యాలు, మ‌న క‌వులు, క‌ళాకారుల‌కు తెలంగాణ వ‌చ్చాకే..త‌గిన గౌర‌వం, గుర్తింపు ద‌క్కింది. నేడు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో దేవాల‌యాల‌ అభివృద్ధి జరుగుతున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్, జిల్లా కలెక్టర్ సిక్తపట్నాయక్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment