Telugu News » AP Assembly : సభలో విజిలేసిన బాలయ్య…అచ్చెన్నాయుడు, అశోక్ సస్పెండ్ !  

AP Assembly : సభలో విజిలేసిన బాలయ్య…అచ్చెన్నాయుడు, అశోక్ సస్పెండ్ !  

ఇవాళ ఉదయం బాలకృష్ణ సభలో విజిల్ వేశారంటూ ఇది నిబంధనలకు విరుద్ధమంటూ సభలో వైసీపీ అభ్యంతరం చెప్పింది.

by Prasanna
balayya

ఏపీ అసెంబ్లీ ఇవాళ కూడా రచ్చతోనే మొదలయ్యింది. అచ్చెన్నాయుడు, బెందాళం అశోలను ఈ అసెంబ్లీ సెషన్స్ మొత్తం సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. వీరిద్దరూ సభలో ఫోన్లతో వీడియోలు తీస్తున్నారంటూ వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపధ్యంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలకృష్ణ సభలో విజిలేయడం కూడా తీవ్ర గందరగోళానికి దారి తీసింది.

balayya

ఇవాళ ఉదయం బాలకృష్ణ సభలో విజిల్ వేశారంటూ ఇది నిబంధనలకు విరుద్ధమంటూ సభలో వైసీపీ అభ్యంతరం చెప్పింది. బాలకృష్ణ విజిల్ వేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిన్న సభలో కూడా బాలకృష్ణ మీసం మెలేయడంతో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

మరో వైపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ లు సభలో వీడియోలు తీస్తున్నారంటూ చీఫ్ విప్ ప్రసాదరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులో వీరిద్దరూ సభలో ఫోన్‌లో వీడియోలు తీస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.

సభ్యులకు వార్నింగ్ ఇచ్చినా సభలో వీడియో తీస్తున్నారని.. వారిని ఈ సభ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. దీంతో వీడియో తీస్తున్న అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌ను ఈ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తునట్టు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.

మరోవైపు… టీడీపీ నేతల నిరసనలతో ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ మొదలైనప్పటి నుంచి ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలుగు దేశం ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో సభ కాసేపు వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలోనూ సైకో పాలన పోవాలి అంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులందరూ సభకు వచ్చి పక్కోదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్‌ను పొట్టన పెట్టకున్న చంద్రబాబు ఇప్పడు జైల్‌లో ఉన్నారన్నారు. చంద్రబాబు అవినీతి బట్టబయలు అయినందునే రాజమండ్రి సెంట్రల్ జైలులో 7691 ఖైదీ నెంబర్‌తో ఉన్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు.

You may also like

Leave a Comment