Telugu News » Vijayawada : కక్ష సాధింపే అన్న చంద్రబాబు… మరో రెండు రోజుల రిమాండ్ 

Vijayawada : కక్ష సాధింపే అన్న చంద్రబాబు… మరో రెండు రోజుల రిమాండ్ 

ఈ నెల 9న అరెస్ట్ న అరెస్ట్ చేసిన చంద్రబాబు ని కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించారు. 14 రోజుల రిమాండ్ గడువు ముగుస్తున్న తరుణంలో శుక్రవారం విచారణ కొనసాగించారు.

by Prasanna
cbn

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ (AP CID) నమోదు చేసిన కేసులో నారా చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ (Judicial Remand) పొడిగించారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) ఆదేశాలు ఇచ్చింది. 24వ తేదీ వరకూ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

cbn

ఈ నెల 9న అరెస్ట్ న అరెస్ట్ చేసిన చంద్రబాబు ని కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించారు. 14 రోజుల రిమాండ్ గడువు ముగుస్తున్న తరుణంలో శుక్రవారం విచారణ కొనసాగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుని కోర్టు ఎదుట హాజరు పరిచారు. రిమాండ్లో లో మీకేమైనా ఇబ్బందులు కలిగాయా అని చంద్రబాబును జడ్జి ప్రశ్నించారు . అనంతరం ఈనెల 24 వరకూ జ్యూడిషియల్ కస్టడీలోనే ఉంటారని తెలిపింది.

విచారణ సందర్భంగా…మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోందని చంద్రబాబుకు జడ్జి తెలిపారు. మీకు విధించిన రిమాండ్ ను శిక్షగా భావించొద్దని చెప్పారు. జైల్లో మీకు ఇబ్బందేమైనా కలుగుతోందా? అని ప్రశ్నించారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, దర్యాప్తులో అన్నీ తేలుతాయని చెప్పారు. చట్టం అందరికీ సమానమేనని అన్నారు.

తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసని జడ్జికి చంద్రబాబు తెలిపారు. రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని తెలిపారు. తన వివరణ తీసుకోకుండానే అరెస్ట్ చేశారని, తన అరెస్ట్ అక్రమమని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. తన హక్కులను కాపాడాలని, న్యాయాన్ని రక్షించాలని జడ్జిని కోరారు. జైల్లో తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నట్టు జడ్జి తెలిపారు.

మరోవైపు చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదననలు వినిపిస్తూ… చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు, చంద్రబాబు కస్టడీపై కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. కస్టడీ తీర్పు నేపథ్యంలో సర్వత్ర తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 

You may also like

Leave a Comment