Telugu News » Parineethi -Raghav: వేడుకగా పరిణితీ..రాఘవ్‌ చద్దా వివాహా వేడుకలు!

Parineethi -Raghav: వేడుకగా పరిణితీ..రాఘవ్‌ చద్దా వివాహా వేడుకలు!

నో ఫోన్​ పాలసీని కూడా అమలు చేయనున్నారట..

by Sai
parineeti-chopra-raghav-chadha-marriage-all-set-for-couples-grand-welcome-in-udaipur-watch

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణితీ చోప్రా కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా చాలా కాలం జాగ్రత్తలు పడ్డారు. కానీ వీరిద్దరూ డిన్నర్ డేట్స్, లంచ్ డేట్స్ కి వెళ్తు కెమెరామెన్ లకు చిక్కారు. ఇంకేముంది ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో, వీరిద్దరి ప్రేమ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. రీసెంట్ గా వీరి నిశ్చితార్థం కూడా జరిగింది.

parineeti-chopra-raghav-chadha-marriage-all-set-for-couples-grand-welcome-in-udaipur-watch

ఇక వీరు పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ జంట సెప్టెంబర్ 24న పెళ్లి చేసుకోనుంది. ఈ జంట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నారు. ఈ రోజు వేదికపైకి వెళ్లనున్నారు. ఈ జంట వారి కుటుంబ సభ్యుల కోసం ఉదయపూర్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

అంతేకాకుండా పెళ్లి వేదిక అంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహ వేడుకలు ది తాజ్ లేక్ ప్యాలెస్, ది లీలా ప్యాలెస్‌లో జరుగుతాయి. వారి పెళ్లి జరగనున్న వేదికకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఢిల్లీలో అర్దాస్ వేడుకతో ప్రారంభమయ్యాయి.

ఆ తర్వాత సంగీత సూఫీ రాత్రి జరిగింది. అతిథుల జాబితాలో ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా ఉన్నారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు సిద్ధార్థ్ చోప్రా కూడా ఉన్నారు. అతిథుల జాబితాలో క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నాడు.

మరోవైపు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ వివాహ వేడుక జరగనుంది. నో ఫోన్​ పాలసీని కూడా అమలు చేయనున్నారట. ఇక పెళ్లికి హాజరు కానున్న అతిథుల జాబితాలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారని సమాచారం. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, అశోక్ గెహ్లోత్​, భూపేశ్ బఘేల్ హాజరుకానున్నారట. వీరితో పాటు 200 మందికి పైగా గెస్ట్​లు ఈ వేడుకకు రానున్నారు.

You may also like

Leave a Comment