Telugu News » PM Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు మామూలు చట్టం కాదు…..!

PM Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు మామూలు చట్టం కాదు…..!

పార్లమెంట్‌ (Parliament ) లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Woman Resrvation Bill) ఆమోదం పొందిన నేపథ్యంలో దేశంలోని మహిళందరికీ ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.

by Ramu
Strong government with majority made it possible PM Modi on Womens Reservation Bill

పార్లమెంట్‌ (Parliament ) లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Woman Resrvation Bill) ఆమోదం పొందిన నేపథ్యంలో దేశంలోని మహిళందరికీ ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. నిన్న, మొన్న కొత్త చరిత్ర సృష్టించడం మనమంతా చూశామని మోడీ అన్నారు. ఆ చరిత్ర సృష్టించే అవకాశాన్ని తనకు కోట్లాది మంది అందించడం తన అదృష్టమన్నారు.

Strong government with majority made it possible PM Modi on Womens Reservation Bill

మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ….. భారీ మెజార్టీతో బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి చారిత్రక బిల్లుకు ఆమోదం లభించిందన్నారు.

లోక్ సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై మూడు దశాబ్దాలుగా చర్చ జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలు ఈ బిల్లు పట్ల నిబద్దతతో పని చేయలేదన్నారు. కొన్ని సార్లు మహిళలు అవమానికి గురయ్యారని చెప్పారు. ఈ చట్టంం ద్వారా ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు గత మూడేండ్లుగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని వెల్లడించారు.

ఇది మహిళా సాధికారత పట్ల తమకు ఉన్న నిబద్ధత అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆ స్వప్నాన్ని నెరవేర్చామన్నారు. ట్రిపుల్ తలాఖ్ ఆచారాన్ని రూపు మాపేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకు వచ్చామన్నారు. కొన్ని చట్లాలకు దేశ స్థితిగతులనే మార్చే పవర్ ఉంటుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అలాంటిదేనని ఆయన పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు సాధారణ చట్టం కాదన్నారు. ఇది నూతన ప్రజాస్వామ్య నిబద్ధకు నిలువుటద్దమన్నారు. ఈ చట్టం మహిళల్లో మనోధైర్యాన్ని నింపుతుందన్నారు. గతంలో మహిళా బిల్లును వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు మహిళల శక్తిని తెలుసుకుని మద్దతిచ్చారన్నారు. మహిళా సంకెళ్లను తెంచేందుకు ఎన్డీఏ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందన్నారు.

You may also like

Leave a Comment