Telugu News » Satyavathi Rathod : అంగన్వాడీలు…! యూనియన్ల ట్రాప్ లో పడకండి!

Satyavathi Rathod : అంగన్వాడీలు…! యూనియన్ల ట్రాప్ లో పడకండి!

దేశంలో ఏ రాష్ట్రమూ తీసుకోని సాహసోపేత నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ తీసుకొని అంగన్వాడీలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ పెంచిందని అన్నారు.

by Prasanna
anganwadi

రాష్ట్రంలోని అంగన్వాడీ (Anganwadi) కార్యకర్తలు తక్షణమే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ (Satyavathi Rathod) కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సేవలను గుర్తించి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇటీవల జారీ చేసిన జీవోలే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. కొన్ని యూనియన్లు ఉద్దేశపూర్వకంగా ఉసి గొల్పడం వల్లే అంగన్వాడీలు సమ్మెబాట (Strike) పట్టారని ఆరోపించారు.

anganwadi

దేశంలో ఏ రాష్ట్రమూ తీసుకోని సాహసోపేత నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ తీసుకొని అంగన్వాడీలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ పెంచిందని అన్నారు.

satyavathi rathod

అంగన్వాడీల సమ్మెతో సమాజంలో ఎక్కువగా ఉన్న బలహీనవర్గాలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సమ్మెతో సమస్యలు పరిష్కారం కావని, సంప్రదింపులు ద్వారానే పరిష్కారం అవుతాయన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక…సీఎం కేసీఆర్‌ 3 సార్లు వేతనాలు పెంచారనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.13,650, మినీ అంగన్వాడీలకు రూ.7,600 వరకు వేతనాలు అందుతున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కనీసం అంగన్వాడీలను ఆయా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణలో అందుతున్న సదుపాయాలు, అధిక వేతనాల విషయంలో ఆలోచన చేయాలని కోరారు.

వాస్తవాలు గ్రహించి వెంటనే విధులకు హాజరు కావాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు మంత్రి. అంగన్వాడీలకు న్యాయం చేసింది, చేయబోయేది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనన్నారు.  త్వరలో ఏర్పాటు కాబోతున్న పీఆర్సీలో కూడా వారికి లబ్ధి చేకూరుతుందని భరోసా ఇచ్చారు. కొంతమంది ఉద్దేపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని, వారి ట్రాప్ లో పడకండని మంత్రి కోరారు.

 

You may also like

Leave a Comment