Telugu News » BJP: మూడు లక్షలు కట్టిన వారికే డబుల్ బెడ్ రూం ఇళ్లు !

BJP: మూడు లక్షలు కట్టిన వారికే డబుల్ బెడ్ రూం ఇళ్లు !

ఇదంతా  కూడా కేసీఆర్, కేటీఆర్లే నడిపిస్తున్నారని ప్రభాకర్ అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలోనే ఆధారాలతో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు.

by Prasanna

తెలంగాణా (Telangana) లో ఎవరు మూడు లక్షలు కడితే వారికే డబుల్ బెడ్ రూం ఇళ్లు (Double Bedroom Houses) ఇస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మేల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) ఆరోపించారు. అందుకే ఏ ప్రభుత్వ కార్యలయంలోనూ కూడా డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులు కనిపించడం లేదని అన్నారు. ప్రగతి భవన్ ఆధ్వర్యంలోనే  డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల లిస్ట్ తయారు అవుతుందని విమర్శించారు.

Double bedroom houses

ఇదంతా  కూడా కేసీఆర్, కేటీఆర్లే నడిపిస్తున్నారని ప్రభాకర్ అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలోనే ఆధారాలతో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. కేసీఆర్ కు నిజంగానే డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో నిజాయితీ ఉంటే ప్రభుత్వ కార్యాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించాలని అన్నారు.

prabhakar

మరో వైపు తెలంగాణాలో పలు చోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీని ప్రభుత్వం చేస్తోంది. హైదరాబాద్ లోనే ఇప్పటీ వరకు దాదాపు 30 వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. రానున్న నెల, నెలన్నర రోజుల్లో మరో 70 వేల మందికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు  అందజేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో మొత్తం లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తున్నట్లు చెప్పారు. ఒక్కొ డబుల్ బెడ్ రూం నిర్మించడానికి ప్రభుత్వానికి రూ. 10 లక్షలు ఖర్చైనట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ప్రభుత్వం రూ. 9,718 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

పేదలు ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వనవసరంలే లేకుండా అత్యంత పారద్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తమ ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందన్నారు. ప్రతిపక్షలు చేస్తున్న విమర్శలు అన్ని రాజకీయాల కోసమేనని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదని అన్నారు.

You may also like

Leave a Comment