Telugu News » Tirumala : గజ వాహనంపై శ్రీవారి దర్శనం

Tirumala : గజ వాహనంపై శ్రీవారి దర్శనం

600 ఏళ్ల క్రితం మహవిష్ణువు తిరుమలలోని ఒక అర్చకుడికి కలలో కనిపించి ఇలా చెప్పాడట...‘శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిక్కులో ఒక లోయ ఉంది... అందులో రహస్య గుహ ఒకటి ఉంది..

by Prasanna
malayappa

తిరుమల (Tirumala) శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో (Brahmostavalu) భాగంగా ఆరో రోజున శ్రీ మలయప్పస్వామి గజ వాహనంపై దర్శనం ఇచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌ సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రదర్శనలు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భ‌క్తులు వాహ‌న‌సేవ‌లో (Vahanaseva) స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

GAJA VAHANAM

600 ఏళ్ల క్రితం మహవిష్ణువు తిరుమలలోని ఒక అర్చకుడికి కలలో కనిపించి ఇలా చెప్పాడట…‘శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిక్కులో ఒక లోయ ఉంది… అందులో రహస్య గుహ ఒకటి ఉంది. ఆ గుహలో ఉన్న విగ్రహాలను తెచ్చి ఉత్సవ మూర్తులుగా పూజా కైంకర్యాలు చేయండి’ అని నిర్దేశించారు. దీంతో మిగతా అర్చకులు అంత కలిసి వెళ్ళి రహస్య గుహలోని ఉత్సవమూర్తులను తీసుకొచ్చారు. ఆ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు.

దీన్ని తమిళంలో ‘మలై కని వుండ్రు పెరుమాల్’ అని పిలుస్తారు. కొండ వంగిన లోయలో లభించిన విగ్రహాలు అని దీనికి అర్థం. అందుకే తిరుమల శ్రీవారిని మలయప్ప స్వామి అని కూడా పిలుస్తుంటారు. శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలతోపాటు.. నిత్య, వార, పక్ష, వార్షిక ఉత్సవాలన్నీ ఈ మలయప్పస్వామి వార్లకే జరుగుతాయి.

ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును నిద్ర లేవగానే దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు.. ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు శ్రీవారు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవ రూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచిమని, మనలో ఉన్న అహంకారం తొలగిపోతే మనకు రక్షణగా భగవంతుడు ఉంటాడనే విషయాన్ని ఈ ఉత్సవం గుర్తు చేస్తుందని అర్చకులు తెలిపారు.

 

 

You may also like

Leave a Comment