Telugu News » New Jersey : అమెరికాలో అతి పెద్ద హిందూ దేవాలయం !

New Jersey : అమెరికాలో అతి పెద్ద హిందూ దేవాలయం !

183 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ సువిశాల అక్షర్‌ధామ్‌ ఆలయంలో పురాతన భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా 10 వేల విగ్రహాలు, సంగీత వాయిద్య పరికరాలు, నృత్య రూపాల శిల్పాలను చెక్కారు.

by Prasanna

భారత్‌ వెలుపల నిర్మితమైన ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం (Hindu Temple) అక్టోబరు 8న అమెరికాలోని న్యూజెర్సీ (New Jersey) లో ప్రారంభం కానుంది. 2011లో రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్ లో ప్రారంభమైన బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ (Akshardham) దేవాలయం నిర్మాణ పనులు 12 ఏళ్ల అనంతరం 2023లో పూర్తయ్యాయి.

Big Hindu Temple

183 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ సువిశాల అక్షర్‌ధామ్‌ ఆలయంలో పురాతన భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా 10 వేల విగ్రహాలు, సంగీత వాయిద్య పరికరాలు, నృత్య రూపాల శిల్పాలను చెక్కారు. ఈ ఆలయాన్ని బీఏపీఎస్‌ అధ్యాత్మిక అధిపతి మహంత్‌ స్వామి మహరాజ్‌ ఆధ్వర్యంలో అక్టోబరు 8న లాంచనంగా ప్రారంభించనున్నట్లు బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ సంస్థకు చెందిన అక్షర్‌ వత్సలదాస్‌ వెల్లడించారు.

హిందూ దేవాలయాలు అనగానే భారత్‌దేశం గుర్తుకొస్తుంది. దేశంలో పెద్ద‌పెద్ద, పురాతన హిందూ దేవాలయాలు ఉన్నాయి. కానీ, భాతదేశం వెలుపల ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మితవుతోంది. అమెరికాలోని న్యూజెర్సీ రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో స్వామినారాయణ్ అక్షరధామ్‌‌గా పలిచుకునే ఈ దేవాలయాన్ని మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో నిర్మితమైంది. కంబోడియాలోని 12వ శతాబ్దం నాటి అంకోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు. ఆ ఆలయం 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇప్పుడు యూనెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ ఉంది. దాని తరువాత ఇదే అతి పెద్దదని హిందూ ఆలయంగా చెబుతున్నారు. ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి హిందువులు తరలివస్తున్నారు.

ఈ ఆలయం 183 ఎకరాల విస్తీర్ణంలో  (ఎత్తు: 42 అడుగులు, వెడల్పు: 87 అడుగులు, పొడవు: 133 అడుగులు) నిర్మాణం జరిగింది. పురాతన హిందూ గ్రంథాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ నిర్మాణం 2011 నుంచి 2023 వరకు సుమారు 12ఏళ్లు పట్టింది. అమెరికా వ్యాప్తంగా తరలివచ్చిన 12 వేల మందికిపైగా ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

న్యూజెర్సీలోని అక్షరధామ్ ఆలయం నిర్మాణంలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప మందిరాలు, తొమ్మిది శిఖరాలు, తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి. ఈ ఆలయంలో సాంప్రదాయ రాతి వాస్తు శిల్ప యొక్క అతి పెద్ద దీర్ఘవృత్తాకార గోపురం ఉంది. ఇది వెయ్యి సంవత్సరాలు ఉండేలా రూపొందించబడింది. సున్నపురాయి, గ్రానైట్, గులాబీ ఇసుకరాయి, పాలరాయితో సహా దాదాపు రెండు మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. అవి భారతదేశం, టర్కీ, గ్రీస్, ఇటలీ, చైనాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించబడ్డాయి.

ఆలయం వద్ద బ్రహ్మ కుండ్ అని పిలవబడే సాంప్రదాయ భారతీయ మెట్లబావి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 300 నీటి వనరుల నుండి నీటిని కలిగి ఉంది.

 

You may also like

Leave a Comment