Telugu News » Vijayawada :  చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ల విచారణ ఎందుకు వాయిదా వేశారంటే…

Vijayawada :  చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ల విచారణ ఎందుకు వాయిదా వేశారంటే…

బెయిల్ పిటిషన్ అంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించగా.. రేపు సీఐడీ కోర్టులో కోరాలని న్యాయమూర్తి సూచించారు.

by Prasanna
chandra babu

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ (Custody), బెయిల్ (Bail) పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు (ACB Court) న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో విచారణ రేపటికి వాయిదా పడింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, ఇదే కేసులో ఆయన కస్టడీని పొడిగించాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల విచారణ రేపు ఏసీబీ కోర్టులో రేపు జరగనున్నాయి.

chandra babu

కస్టడి పిటిషన్‌పై చంద్రబాబు తరపు న్యాయవాదులు దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. కాగా.. బెయిల్ పిటిషన్ అంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించగా.. రేపు సీఐడీ కోర్టులో కోరాలని న్యాయమూర్తి సూచించారు.

చంద్రబాబు బెయిల్ పిటిషన్, ఆయన కస్టడీని పొడిగించాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు ఇవాళ విచారించడానికి సముఖత చూపలేదు. అందుకే రేపటికి వాయిదా వేసింది. ఇప్పటి వరకు ఈ కేసును విచారించిన జడ్జి ఈరోజు సెలవులో ఉండటంతో… మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సత్యానందం ఈరోజు ఇన్ఛార్జి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

పిటిషన్లపై తమ వాదనలను వినాలని చంద్రబాబు, సీఐడీ తరపు లాయర్లు జడ్జి సత్యానందంను కోరారు. అయితే, ఈ ఒక్క రోజు వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం తనకు కష్టసాధ్యమని ఆయన చెప్పారు. రేపటి నుంచి తాను సెలవుపై వెళ్తున్నానని తెలిపారు. రేపు రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని సూచించారు. దీంతో బెయిల్, కస్టడీ పిటిషన్ లపై విచారణ రేపటికి వాయిదా పడింది.

మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోను పరిశీలనలోకి తీసుకున్న సీజేఐ.. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. అయితే ఈ పిటిషన్ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో నేటి సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది.

 

You may also like

Leave a Comment