Telugu News » BRS : ప్లీజ్…మా ఎమ్మేల్యేకు టిక్కెట్ ఇవ్వొద్దు !

BRS : ప్లీజ్…మా ఎమ్మేల్యేకు టిక్కెట్ ఇవ్వొద్దు !

చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలంటూ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలని.. నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

by Prasanna
MLA

బీఆర్ఎస్ (BRS) పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనంటూ చాలా కాలం కిందటే ఒక జాబితా విడుదల చేసింది. అయితే వీరిలో కొందరికి టిక్కెట్ ఇవ్వొద్దంటూ జరుగుతున్న నిరసనలు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. అలాంటి పరిస్థితి జగిత్యాల (Jagityala) జిల్లా చొప్పదండి (Choppadandi) నియోజకవర్గంలో కనిపిస్తోంది.

MLA

చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలంటూ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలని.. నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోయిందని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అందరికి గెలిచే వాళ్లే టిక్కెట్లు ఇచ్చిందని అనుకుంటే…చొప్పదండిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదని అన్నారు.

ప్రస్తుతం ఎమ్మేల్యే సుంకే రవిశంకర్ కాకుండా వేరే వారికి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గంలోని కొడిమ్యాల, గంగాధర, రామడుగు మండలంలోని నాయకులు నల్గొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామికి 116 కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు. అలాగే తమ విన్నపం కేసీఆర్ చేరాలని ఆ స్వామిని కోరుకున్నామని చెప్పారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రాఫ్ బాగోలేదని, అతనికే బీఫాం ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమంటూ నిరసన తెలిపారు.

సుంకే రవిశంకర్ కు కాకుండా ఇంకెవరికైనా బీఫాం కేటాయించాలని సీఎం కేసీఆర్ ను కోరారు. కాగా రెండు రోజుల క్రితం నియోజక వర్గంలోని మల్యాల మండలంలో ఎమ్మెల్యే ప్రోగ్రాంను 12 మంది సర్పంచులు బై కాట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ గొడవ సద్దుమణగక ముందే మరోసారి ఇలా తనకు బీఫాం ఇవ్వొద్దంటూ నిరసనలు తెలపడం రవి శంకర్ కు తలనొప్పిగా మారింది.

You may also like

Leave a Comment