Telugu News » zealandia : ఏడు కాదు ఎనిమిది… మరో ఖండాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

zealandia : ఏడు కాదు ఎనిమిది… మరో ఖండాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

365 ఏండ్లుగా కనబడకుండా ఉన్న ఈ ఖండాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

by Ramu
Scientists Discover 8th Continent That Had Been Missing For 375 Years

శాస్త్రవేత్తలు మరో నూతన ఖండాన్ని (Continent) కనుగొన్నారు. 365 ఏండ్లుగా కనబడకుండా ఉన్న ఈ ఖండాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా జియాలజిస్టులు (Geologists), సిస్మాలజిస్టులు (Sismalagists) కలిసి నూతంగా జిలాండియా (zealandia) రిఫైన్ డ్ మ్యాప్ (Refinded) ను రూపొందించారు.

Scientists Discover 8th Continent That Had Been Missing For 375 Years

సముద్ర అడుగు భాగం నుంచి సేకరించిన డ్రెడ్జ్ రాక్ నమూనాల నుంచి పరీక్షలు నిర్వహించి ఈ ఖండం ఉనికిని నిర్ధారించారు. గతంలో చేసిన పరిశోధనల ప్రకారం…. 83 మిలియన్ల సంవత్సరాల క్రితం గోండ్వానా మహా ఖండం అనేది జియోలాజికల్ బలాల వల్ల విడిపోయి ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఖండాలు ఏర్పడ్డాయి.

అదే సమయంలో ఆ బలాల వల్ల జిలాండియా ఏర్పడింది. జిలాండియాలో 94 శాతం భూభాగం ఫసిఫిక్ మహాసముద్రంలో 2 కిలో మీటర్ల లోతులో వుంది. ఇక మిగిలిన 6 శాతం భూభాగం న్యూజిలాండ్ మాదిరిగా చిన్న దీవులుగా వున్నట్టు తెలిసింది. ఇది ఇలా వుంటే 1642లోనే జిలాండియా గురించి డచ్‌ సెయిలర్‌ అబెల్‌ టాన్మాన్‌ వెల్లడించారు. కానీ ఆయన ప్రకటనను ధ్రువపరిచే ఆధారాలను ఆయన అందించలేకపోయారు.

దీంతో జిలాండియా గురించి పెద్దగా ఎవరూ పట్టించు కోలేదు. కానీ తాజాగా 375 ఏండ్ల తర్వాత శాస్త్రవేత్తలు జిలాండియాను నిర్దారించారు. తాజాగా పరిశోధకుల బృందం సముద్రపు నుండి పైకి తీసుకు వచ్చిన రాళ్లు, అవక్షేప నమూనాలను అధ్యయనం చేసింది. ఈ అధ్యయనాల ద్వారా జిలాండియా ప్రస్తుత మ్యాప్‌లను రూపొందించింది. ఏ కారణాల వల్ల గోండ్వానా నుంచి జిలాండియా విడిపోయందన్న వివరాలను మాత్రం శాస్త్రవేత్తలు వివరించలేకపోయారు.

You may also like

Leave a Comment