Telugu News » Tirumala : తిరుమలలో ఒక్కసారి భారీగా పెరిగిన భక్తుల రద్దీ…..!

Tirumala : తిరుమలలో ఒక్కసారి భారీగా పెరిగిన భక్తుల రద్దీ…..!

సర్వ దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది.

by Ramu
number devotees has increased tirumala

తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తమిళనాడు (Tamilnadu) భక్తులు భారీగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపార్ట్ మెంట్లు అన్నీ నిండి పోయారు. సర్వ దర్శనం (Sarva Darshan) కోసం సుమారు మూడు కిలో మీటర్ల మేర భక్తులు (Devotees) క్యూ లైన్లలో వేచి వున్నారు. దీంతో సర్వ దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది.

number devotees has increased tirumala

తమిళ నాడులో పెరటాసి మాసం మొదలైంది. ఈ నేపథ్యంలో వేలాదిగా తమిళ భక్తులు తిరుమల దర్శనానికి వస్తున్నారు. దీంతో ఒక్క సారిగా భక్తులు రద్దీ పెరిగి పోయింది. దీంతో వైకుంఠం క్యూ1 క్యూ2 కాంప్లెక్స్ లన్నీ పూర్తిగా భక్తులతో నిండి పోయాయి. ఇక పెరటాసి మాసం నేపథ్యంలో భక్తుల రద్దీని ముందే ఊహించి భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఇక శ్రీవారిని శుక్రవారం 66,233 మంది భక్తులు దర్శించుకున్నట్టు టీటీడీ వెల్లడించింది. శ్రీవారి హుండీ ఆదాయం శుక్రవారం రూ. 4.71 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు. తిరుమలలో నిన్న పౌర్ణమి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. గరుడ వాహనంపై మలయప్ప స్వామి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.

భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలో కొండమీద భక్తులకు ఆహారంతో పాటు నీరు ఇతర అన్ని సౌకర్యాలను అందుబాటులో వుంచామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

You may also like

Leave a Comment