Telugu News » ISRO : మంగళయాన్-2 కు రెడీ అవుతున్న ఇస్రో……!

ISRO : మంగళయాన్-2 కు రెడీ అవుతున్న ఇస్రో……!

మంగళ్ యాన్-2 (Mangalyan-2) లో రెండు పే లోడ్స్ ఉంటాయని ఇస్రో అధికారులు చెబుతున్నారు.

by Ramu
ISRO begins preparation for India’s 2nd mission to Mars

అంగారకుడి (Mars )పైకి మరో వ్యోమ నౌక (Space Craft)ను పంపేందుకు భారత్ (India) రెడీ అవుతోంది. తొలి ప్రయత్నంలోనే అరుణ గ్రహం కక్షలో రాకెట్ ప్రవేశ పెట్టి ఇస్రో (ISRO) విజయం సాధించింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి మార్స్ పై ప్రయోగాలకు సిద్దమవుతోంది. మంగళ్ యాన్-2 (Mangalyan-2) లో రెండు పే లోడ్స్ ఉంటాయని ఇస్రో అధికారులు చెబుతున్నారు.

ISRO begins preparation for India’s 2nd mission to Mars
ఇందులో ఉండే ఈ రెండు పే లోడ్స్ అంగారక గ్రహం గురించి అధ్యయనం చేయనున్నాయి. మార్స్ లో ఉండే అంతర్ గ్రహ ధూళి, మార్స్ పై ఉండే వాతావరణాన్ని, అక్కడి పర్యావరణాన్ని అధ్యయం చేయనున్నట్టు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. ఈ పే లోడ్స్ ను వివిధ దశల్లో అభివృద్ధి చేసినట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ మిషన్ లో భాగంగా మార్స్ ఆర్బిట్ డస్ట్ ఎక్స్ పరిమెంట్ (MODEX)ను నిర్వహించున్నారు.

దీంతో పాటు రేడియో ఆక్యులేషన్ (RO),ఎనర్జిటిక్ అయాన్ స్పెక్ట్రో మీటర్ (EIS), లాంగ్ మ్యూర్ ప్రోబ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ పరిమెంట్ లను ఈ మార్స్ మిషన్ నిర్వహించనుంది. ఇస్రో డాక్యుమెంట్స్ ప్రకారం… మార్స్ మీద ఎత్తైన ప్రదేశాలలో ధూళి కణాల పుట్టుక, సమృద్ధి, పంపిణీ ప్రవాహాన్ని అర్థం చేసుకోవడంలో MODEX సహాయ పడుతుందని పేర్కొంది.

ఇక మార్స్ పై తటస్త, ఎలక్ట్రాన్ సాంద్రత పొఫైల్ తయారు చేసేందుకు RO ప్రయోగం ఉఫయోగపడుతుంది. ఇక అంగారకుడి వాతావరణంలోని సౌరశక్తి కణాలు, సూపర్ థర్మల్ సోలార్ విండ్ కణాలను గుర్తించేందుకు ఇస్రో ఒక EISను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇది ఇలా వుంటే మంగళ్ యాన్-1ను 5 నవంబర్ 2013లో పీఎస్ఎల్వీ సీ-25 ద్వారా ఇస్రో ప్రయోగించింది.

You may also like

Leave a Comment