Telugu News » Tirumala : 29న చంద్రగ్రహణం.. తిరుమల ఆలయం ఎన్ని గంటలు మూసేస్తారో తెలుసా..?

Tirumala : 29న చంద్రగ్రహణం.. తిరుమల ఆలయం ఎన్ని గంటలు మూసేస్తారో తెలుసా..?

ఈ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం (Temple) 28 రాత్రినే మూసివేయనున్నారు. మళ్లీ 29న తిరిగి తెరుస్తారు. 

by Ramu
Partial Lunar Eclipse Tirumala temple to be closed

గ్రహణం రోజున తిరుమల (Tirumala) ఆలయం కొద్దిసేపు మూసివేస్తుంటారు. ఈనెల 29న తెల్లవారు జామున పాక్షిక చంద్రగ్రహణం ఉంది. ఈ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం (Temple) 28 రాత్రినే మూసివేయనున్నారు. మళ్లీ 29న తిరిగి తెరుస్తారు.

Partial Lunar Eclipse Tirumala temple to be closed

29వ తేదీ తెల్లవారుజామున 1.05 గంటల నుండి తెల్లవారుజామున 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది.  కాబట్టి 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు.

గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేస్తారు. గ్రహణం తర్వాత 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసివేసి ఉంటాయి.

ఈ కారణంగా 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనం రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామివారి దర్శనానికి ప్లాన్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

You may also like

Leave a Comment