ప్రధాని మోడీ (PM Modi) మహబూబ్ నగర్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బీఆర్ఎస్ (BRS), ఎంఐఎం (MIM) పై ఆయన చేసిన వ్యాఖ్యలు, వారసత్వ రాజకీయాలపై చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బీఆర్ఎస్ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. రాష్ట్రానికి ఏం చేయని మోడీ.. ఎందుకొస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఇటు కాంగ్రెస్ (Congress) శ్రేణులు కూడా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ ను గెలిపించేందుకే మోడీ తాపత్రయపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని మరోసారి తెలంగాణ (Telangana) పర్యటనకు వస్తున్నారు. మంగళవారం నిజామాబాద్ (Nizamabad) లో పర్యటించనున్నారు మోడీ. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
ప్రధాని నిజామాబాద్ షెడ్యూల్
03-10-2023
– మ. 2.10 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు
– మ. 2.55 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ కు వెళ్తారు
– మ. 3.నుంచి 3.35 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు
– మ. 3.45 నుంచి 4.45 గంటల వరకు పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు
– సా. 4.55 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 5.45 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు.
– అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు ప్రధాని మోడీ