Telugu News » NIA Raids : ఎన్ఐఏ సోదాలు…సత్యసాయి జిల్లాలో చంద్ర అరెస్ట్ !

NIA Raids : ఎన్ఐఏ సోదాలు…సత్యసాయి జిల్లాలో చంద్ర అరెస్ట్ !

మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు జరిపినట్లు తెలిసింది.

by Prasanna
NIA

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఎన్ఐఏ (NIA) అధికారులు సోదాలు (Raids) నిర్వహించారు. హైదరాబాద్, వరంగల్, నెల్లూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి (Sri Satya Sai), శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో పలువురు పౌరహక్కుల నేతల ఇళ్లలో ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగాయి.

NIA

సోమవారం తెల్లవారు జాము 5.30 గంటల నుంచి ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహించాయి. అమరుల బంధు మిత్రుల సంఘం, పౌరహక్కుల సంఘం కీలక నేతల ఇళ్లలో అధికారుల తనిఖీలు చేశారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు జరిపినట్లు తెలిసింది.

ఇందులో శ్రీ సత్యసాయి కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుల్ల గ్రామంలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. కుటాగుళ్ల గ్రామానికి చెందిన చంద్ర నరసింహులు అనే వ్యక్తి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు.

ఈమధ్య కాలంలోనే సెంట్రల్ కమిటీ సమావేశాల్లో పాల్గొనడంతో ఎన్ఐఏ  అధికారులు నిఘా పెట్టి ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ మధ్య స్థానికంగా కొన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని అనుమానంతో చంద్రను ఎన్ఐఏ అధికారులు విచారించారు.

చంద్ర నరసింహులు నుండి ఒక పిస్తోలు, 14 రౌండ్ల బుల్లెట్లు, కొన్ని కరపత్రాలు ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.చంద్ర ప్రగతిశీల కార్మిక సమాఖ్యలో జిల్లా నాయకుడిగా పనిచేస్తున్నాడు. ఇతను అప్పుడప్పుడు విప్లవ సాహిత్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఎన్ఐఏ  అధికారులు మొత్తం ఐదు మంది టీంలుగా వచ్చి చంద్రాను అదుపులోకి తీసుకున్నారు.

You may also like

Leave a Comment