Telugu News » Telangana : కేటీఆర్ వస్తే అరెస్టేనా?

Telangana : కేటీఆర్ వస్తే అరెస్టేనా?

శ్రీహరి రావుతో పాటు కాంగ్రెస్ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. పూర్తికాని ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ శ్రేణులు.

by admin
KTR Strong counter to Pm modi

సీఎం కేసీఆర్ (CM KCR) జ్వరం బారిన పడడంతో అన్నీ తానై బీఆర్ఎస్ (BRS) పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మంత్రి కేటీఆర్ (KTR). వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. తాజాగా నిర్మల్ (Nirmal) జిల్లాకు వెళ్లారు. అయితే.. ఎక్కడికక్కడే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేశారు. ఖానాపూర్ పట్టణానికి చెందిన పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

KTR Strong counter to Pm modi

భైంసాలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవీ, రాష్ట కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్, బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇవి అక్రమ అరెస్టులు అని బీజేపీ నేతలు ఖండించారు.

మరోవైపు, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో కేటీఆర్ కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా 27వ ప్యాకేజీ ప్రారంభోత్సవం కోసం కేటీఆర్ రాగా.. అదే సమయంలో అక్కడికి డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు, కాంగ్రెస్ నేతలు వచ్చారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

శ్రీహరి రావుతో పాటు కాంగ్రెస్ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. పూర్తికాని ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఇటు కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సీఐటీయూ నాయకులను, అంగన్వాడీ టీచర్లను, ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కనీస వేతనాలు ఇవ్వాలని సమ్మె చేస్తుంటే అరెస్టు చేయడం సరికాదన్నారు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు.

You may also like

Leave a Comment