నందమూరి బాలకృష్ణకు (Balakrishna) ఏపీ (AP) తో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మనిషి కాస్త కటువుగా మాట్లాడినా మనసు మాత్రం వెన్న అని మురిసిపోతారట ఆయనను దగ్గరగా చూసిన అభిమానులు. ఆయనపై ఉన్న అభిమానం అలాంటిది మరి..
ఇకపోతే బాలయ్య తాజా చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). కాజల్ (Kajal) హీరోయిన్ కాగా… శ్రీలీల (Srileela) ముఖ్య పాత్రలో నటిస్తుండగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హన్మకొండలో ఏర్పాటు చేశారు.
ఇక బాలయ్య అభిమానుల్లో రచ్చ రవి (Rachha Ravi) ఒకరు. అదే జిల్లాకు చెందిన రచ్చ రవి.. భగవంత్ కేసరి ఈవెంట్‌లో పాల్గొని రచ్చరచ్చ చేశాడు. ఆయన కోసం స్పెషల్ గా బోటి ఫ్రై, తలకాయ కూర చేసి తీసుకొచ్చాడు. తన తల్లి అభిమానంతో స్వయంగా వండిన వంటకాన్నిటేస్ట్ చేయాల్సిందిగా బాలయ్య బాబును కోరాడు. కాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ముగిసిన తర్వాత తలకాయ కూర, బోటి కూర టేస్ట్ చేసిన బాలయ్య అద్బుతం అంటూ కితాబిచ్చాడు.
అంతకు ముందే రచ్చ రవి, ఆయన తల్లి, పిల్లలు బాలయ్యతో పాటుగా అక్కడున్న నటీనటులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం రచ్చ రవి బాలయ్య బాబు గురించి మాట్లాడుతూ.. నువ్వు నా చిన్ని కృష్ణుడివే అంటూ ముద్దుల వర్షం కురిపించారు. ఆయన ప్రేమను చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే అని అన్నారు.