Telugu News » Mahesh Babu : అభిమానులకు అంతుచిక్కని మహేష్, నమ్రత స్ట్రాటజీ..సితార కెరియర్ లో జరిగేది ఇదేనా..!!

Mahesh Babu : అభిమానులకు అంతుచిక్కని మహేష్, నమ్రత స్ట్రాటజీ..సితార కెరియర్ లో జరిగేది ఇదేనా..!!

ఈ మ్యాటర్ లో ఏదైనా స్ట్రాటజీ ఉందా.. అందుకే సితారని అందరికీ పరిచయం చేస్తున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.. అయితే సితార కెరియర్ పరంగా మహేష్ నమ్రత (Namrata) భారీగా ప్లాన్స్ వేసారని దీంతో ఈమె కెరియర్ పై ఇప్పటినుంచే ఫోకస్ చేస్తున్నారని సిని వర్గాలలో ప్రచారం

by Venu

టాలీవుడ్ (Tollywood) హీరోల వారసులు తెరపై కనిపించడం కొత్త కాదు. కానీ హీరోయిన్స్ గా వచ్చిన వారు మాత్రం అతికొద్దిమంది. అందులో సక్సెస్ అందుకున్న వారిని సులువుగా గుర్తించవచ్చు. అయితే ఇప్పుడు పట్టుమని 15 సంవత్సరాలు కూడా లేని చిన్నారి ఇండస్ట్రీలో హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొంది. ఆమె టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) వారసురాలు సితార (Sitara). ఘట్టమనేని వారసురాలిగా అందరికీ సుపరిచితమైనటువంటి సితార (Sitara) చిన్న వయసులోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఇన్ని రోజులు చదువు, సోషల్ మీడియాకి (Social media) మాత్రమే పరిమితమైన సితార ఒక జువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం.. పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షించడం చూస్తుంటే అభిమానులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ మ్యాటర్ లో ఏదైనా స్ట్రాటజీ ఉందా.. అందుకే సితారని అందరికీ పరిచయం చేస్తున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.. అయితే సితార కెరియర్ పరంగా మహేష్ నమ్రత (Namrata) భారీగా ప్లాన్స్ వేసారని దీంతో ఈమె కెరియర్ పై ఇప్పటినుంచే ఫోకస్ చేస్తున్నారని సిని వర్గాలలో ప్రచారం జరుగుతుంది.

అంతేకాకుండా ఇప్పటినుంచి సితార ప్రేక్షకులకు చేరువ అయితే.. హీరోయిన్ అయిన తర్వాత తన కెరియర్ ఎలాంటి ఢోకా లేకుండా సాగుతోందనే ఆలోచనతోనే మహేష్, నమ్రత, ఉన్నఫలంగా సితారను హైలెట్ చేస్తున్నారని ప్రచారం. మహేష్ బాబు విషయంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ ఇదే ఫార్ములా ఉపయోగించారట. అందుకే కెరియర్ పరంగా మహేష్ బాబు ఓ రేంజ్ లో ఉన్నారని టాలీవుడ్ లో అనుకొంటున్నారు.

You may also like

Leave a Comment