Telugu News » Shani Louk: హమాస్ మిలిటెంట్ల అరాచకం… మహిళను హత మార్చి, శవాన్ని నగ్నంగా ఊరేగించి….!

Shani Louk: హమాస్ మిలిటెంట్ల అరాచకం… మహిళను హత మార్చి, శవాన్ని నగ్నంగా ఊరేగించి….!

డియోలో మహిళ శరీరంపై కనిపిస్తున్న టాటూ ఆధారంగా ఆమెను జర్మనీకి చెందిన షనీ లౌక్ గా గుర్తించారు.

by Ramu
Hamas terrorists robbed German woman Shani Louk before killing and parading her naked

ఇజ్రాయెల్‌ (Israel) లో హమాస్ (Hamas) మిలిటెంట్లు అరాచకానికి పాల్పడుతున్నారు. జర్మనీకి చెందిన ఓ మహిళను హమాస్ మిలిటెంట్లు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె శవాన్ని పికప్ ట్రక్కుకు కట్టి నగ్నంగా ఊరేగించి రాక్షసానందాన్ని పొందారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హమాస్ మిలిటెంట్ల క్రూరత్వంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Hamas terrorists robbed German woman Shani Louk before killing and parading her naked

వీడియోలో మహిళ శరీరంపై కనిపిస్తున్న టాటూ ఆధారంగా ఆమెను జర్మనీకి చెందిన షనీ లౌక్ గా గుర్తించారు. ఆ వీడియోలు వైరల్ అయిన కొద్ది సేపటికే దీనిపై షనీ లౌక్ తల్లి స్పందించారు. కిబాజ్ రీమ్ లో జరుగుతున్న ఓ పార్టీకి అటెండ్ అయ్యేందుకు షనీలౌక్ కు వెళ్లారని తెలుస్తోంది. ఆ సమయంలో ఒక్క సారిగా హమాస్ మిలిటెంట్లు పార్టీపై దాడి చేశారు.

ఆ పార్టీలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడటంతో భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఇది ఇలా వుంటే ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ తన కూతురు షనీ లౌక్ లాగే కనిపిస్తోందని ఆమె తల్లి అన్నారు. జీపులో ఆ మహిళ స్పృహ లేకుండా పడి వున్నారని తెలిపింది. దీనికి సంబంధించిన అప్ డేట్ వీడియోలను పంపించాలని, తన కూతురు గురించి మరిన్ని విషయాలను అందజేయాలని నెటిజన్లను, ఇజ్రాయెల్ అధికారులను ఆమె కోరారు.

ఇజ్రాయెల్ లో పీస్ పార్టీకి వెళ్లిన ఆమె హమాస్ మిలిటెంట్ల దాడి తర్వాత కనిపించ కుండా పోయారని షనీ లౌక్ సోదరుడు ఒకరు తెలిపారు. ఖచ్చితంగా ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ షనీ లౌక్ అయి వుంటుందని ఆమె సోదరుడు అన్నారు. ఇది తమ కుటుంబానికి అత్యంత భయంకరమైన పీడ కల అని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment