Telugu News » operation Ajay : ఆపరేషన్ అజయ్…. మూడవ విమానంలో 197 మంది….!

operation Ajay : ఆపరేషన్ అజయ్…. మూడవ విమానంలో 197 మంది….!

197 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది.

by Ramu
Third Operation Ajay flight carrying 197 Indian nationals from war-torn Israel arrives in Delhi

ఇజ్రాయెల్‌ (Israel)లో చిక్కుకున్న భారతీయుల (Indians) ను స్వదేశానికి తరలించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ‘ఆపరేషన్ అజయ్’(Operation Ajay) లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారతీయులతో బయలు దేరిన మూడవ విమానం ఢిల్లీకి చేరుకుంది. మొత్తం 197 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది.

Third Operation Ajay flight carrying 197 Indian nationals from war-torn Israel arrives in Delhi

 

ప్రత్యేక విమానం నిన్న సాయంత్రం ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ నగరం నుంచి నిన్న సాయంత్రం బయలుదేరినట్టు ఇజ్రాయెల్ లోని ఇంియన్ ఎంబసీ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వెల్లడించింది. ఆపరేషన్ విజయ్‌లో భాగంగా టెల్ అవీవ్ నుంచి ప్రత్యేక విమానం కాసేపటి క్రితం టెల్ అవీవ్ నుంచి బయలుదేరినట్టు పేర్కొంది. భారతీయులంతా ఇండియాకు సురక్షితంగా చేరుకోవాలని ఎంబసీ కోరుకుంటున్నట్టు చెప్పింది.

ప్రత్యేక విమానం భారత్ కు చేరుకోగానే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ప్రధాని మోడీకి ధన్య వాదాలు, శుభాకాంక్షలు అని తెలిపింది. దేశ ప్రజల రక్షణ కోసం ప్రధాని మోడీ అంకిత భావంతో పని చేస్తున్నారని వెల్లడించింది. ఇజ్రాయెల్ నుంచి భారతీయులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారని పేర్కొంది. స్వదేశానికి చేరుకున్న తర్వాత భారతీయులంతా సంతోషంగా ఫీల్ అవుతున్నారని చెప్పింది.

ఇటీవల ఇజ్రాయెల్ పై హమాసె్ మెరుపు దాడులు చేసింది. రాకెట్లతో భీకరమైన దాడులకు దిగింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతి దాడులు చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్దం మొదలైంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ఇండియన్స్ ను భారత్ కు రప్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆపరేషన్ అజయ్ మొదలు పెట్టింది.

You may also like

Leave a Comment