ఇజ్రాయెల్ (Israel) ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ (Benjiman Nethnyahu) పై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెతన్యాహు ఒక దెయ్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నెతన్యాహు నిరంకుశమైన పాలకుడని, యుద్ద నేరస్తుడు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ఓవైసీ స్పందించారు. తాను పాలస్తీనాకు మద్దతుగా నిలబడతానని, పాలస్తీనాకు తన మద్దతును కొనసాగిస్తానని చెప్పారు. ఇజ్రాయెల్ లో ఇంకా యుద్దం చేస్తున్న గాజాలోని ధైర్య వంతులకు మిలియన్ల సెల్యూట్స్ అని తెలిపారు. నెత న్యాహూ ఒక దెయ్యం అని అన్నారు. నిరంకుశ పాలకుడు, యుద్ధ ఖైది అంటూ ఫైర్ అయ్యారు.
భారత్లో పాలస్తీనా పేరు ఎత్తే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామంటూ ఓ బాబా ముఖ్యమంత్రి అంటున్నారని మండిపడ్డారు. ఓ బాబా ముఖ్య మంత్రి వినండన్నారు. తాను పాలస్తీనా జెండాను తన భుజంపై మోస్తానన్నారు. అదే సమయంలో భారత పతాకాన్ని కూడా మోస్తానని చెప్పారు. తాను పాలస్తీనాకు మద్దతుగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
పాలస్తీనియున్లపై దాడులను ఆపేలా చూడాలని ప్రధాని మోడీకి తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు వెల్లడించారు. పాలస్తీనా అనేది కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదని చెప్పారు. అది మానవత్వానికి సంబంధించిన అంశం అని చెప్పారు. అంతకు ముందు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ సీడబ్ల్యూసీ ఇజ్రాయెల్- హమాస్ మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది.