Telugu News » Delhi Earthquake : ఢిల్లీలో మరో భూకంపం..3.1 తీవ్రతతో కంపించిన భూమి..

Delhi Earthquake : ఢిల్లీలో మరో భూకంపం..3.1 తీవ్రతతో కంపించిన భూమి..

నేపాల్‌లో భూమి కంపించడం వల్ల ఉత్తరాది ప్రాంతాల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని అధికారులు అంటున్నారు. దేశ రాజధాని నాల్గవ భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం భూకంపాలకు గురయ్యే అధిక రిస్క్ జోన్లలో ఒకటి.

by Venu
Earthquake in Ladakh: Huge earthquake.. 4.5 intensity on the Richter scale..!

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఆదివారం (Sunday) భూమి కంపించింది (Earthquake). రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1గా నమోదైనట్టు NCR అధికారులు వెల్లడించారు. భూమి ఉన్నట్టుండి కంపించడంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. సాయంత్రం 4.08 గంటలకు హర్యానా (Haryana), ఫరీదాబాద్‌ (Faridabad)లో సంభవించిన భూకంపంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొంత మంది ఆఫీస్‌లు ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చారు.. మరోవైపు ఈ భూకంప ప్రభావం దాదాపు 10కిలోమీటర్ల లోతు వరకూ కనిపించినట్టు అధికారులు వెల్లడించారు.

అయితే ఇప్పటి వరకూ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు నమోదు కాలేదు. అధికారులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించారు. మరోవైపు ఢిల్లీలో భూకంపం నమోదవడం ఈ నెలలో ఇది రెండోసారి. ఎక్కువగా ఢిల్లీ-NCR ప్రాంతాల్లోనే ఈ ప్రభావం కనిపిస్తోంది. అటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, లఖ్‌నపూర్, అమ్రోహలో తరచూ భూకంపాలు నమోదవుతున్నాయి.

ఇటీవల నేపాల్‌లో భూమి కంపించడం వల్ల ఉత్తరాది ప్రాంతాల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని అధికారులు అంటున్నారు. దేశ రాజధాని నాల్గవ భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం భూకంపాలకు గురయ్యే అధిక రిస్క్ జోన్లలో ఒకటి. ఆగస్టు 5న ఆఫ్ఘనిస్తాన్‌లో 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో 181 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అప్పట్లో తెలిపింది.

You may also like

Leave a Comment