Telugu News » ప్రవళిక కేసులో ట్విస్ట్.. అసలు నిజం ఏమిటి..? ప్రవళిక తప్పు చేసిందా..?

ప్రవళిక కేసులో ట్విస్ట్.. అసలు నిజం ఏమిటి..? ప్రవళిక తప్పు చేసిందా..?

ప్రవళిక తప్పు చేసిందా..?

by Sravya

శుక్రవారం హైదరాబాదులో, గాంధీనగర్ లో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ప్రవళిక సూ!సై!డ్ చేసుకున్నారు. ఆమె ఆత్మ$త్యకి సంబంధించి శుక్రవారం ఆమె సొంత ఊర్లో కూడా పలు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రవళిక ఆత్మ$త్య చేసుకున్న నేపథ్యంలో సంఘీభావంగా బిజెపి అలానే వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలను నిర్వహించాయి. శుక్రవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించడంతో, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆమె ఆత్మ$త్యకి బాధ్యత వహించాలని పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్లో డిమాండ్ చేయడం జరిగింది.

Also read:

ప్రవళిక ఇలా చేసుకోవడానికి కారణం ప్రేమ వ్యవహారమని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రకటించడం సంచలనంగా మారిపోయింది. ప్రియుడు మోసం చేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడం వలన ఆమె సూసై$ చేసుకుందని వివరించారు. 15 రోజుల క్రితం ఆమె అశోక్ నగర్ లో బృందావన్ గర్ల్స్ హాస్టల్లో చేరింది. ఆమె గ్రూప్ కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉంటోంది. హాస్టల్లో ఆమెకి ఇద్దరు స్నేహితురాళ్ళు ఉన్నారు. శుక్రవారం ఒక్కరే రూమ్లో ఉండడంతో చున్నితో ఫ్యాన్ కి ఉ$రి వేసుకొని సూసై$ చేసుకుంది. ఆమె ఒక నోట్ కూడా రాసింది. అలానే ఫోన్లో చాటింగ్ ని కూడా గమనించారు పోలీసులు. శివరాం రాథోడ్ అనే యువకుడితో ఆమె ప్రైవేట్ చాటింగ్ చేసింది. గురువారం ఉదయం అతనితో పాటుగా బాలాజీ దర్శనం అనే హోటల్లో టిఫిన్ కూడా చేసింది. శివరాం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ప్రవళిక చాట్ లో గమనించారు పోలీసులు.

అతను మోసం చేశాడని అందుకే ఇలా చేసిందని పోలీసులు ఒక నిర్ధారణకి వచ్చారు. తల్లిదండ్రులకి కూడా ఆమె ప్రేమ గురించి తెలుసని పోలీసులు అంటున్నారు. ఈ విషయంపై ఆమెని మందలించారు అనికూడా అంటున్నారు. శివరాం పై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. కానీ తల్లిదండ్రులు చెప్తున్న విషయం వేరేలా ఉంది ఉద్యోగ నియామకాలను కి సంబంధించి నోటిఫికేషన్లు వాయిదా వేయడంతో ఆమె ఇలా చేసుకుంది అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కూతురిపై లేనిపోని అబండాలు వేస్తున్నారని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. అయితే మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment