Telugu News » Shafali Vaidhya: మరోసారి ట్రెండింగ్ లోకి ‘నో బిందీ … నో బిజినెస్’…..!

Shafali Vaidhya: మరోసారి ట్రెండింగ్ లోకి ‘నో బిందీ … నో బిజినెస్’…..!

ఇప్పటికే జ్యుయెలరీ, వస్త్రాలు, ఫ్యాషన్ (Fashion) రంగాలకు చెందిన కంపెనీలు రకరకాల యాడ్స్ తో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటున్నాయి.

by Ramu

దసరా , దీపావళి పండుగకు మరి కొన్ని రోజులే మిగిలి వుంది. ఈ పండుగ సీజన్‌లో ప్రజలను ఆకట్టుకుని తమ బిజినెస్ (Business) మరింత పెంచుకోవాలని పలు వ్యాపార సంస్థలు అనుకుంటున్నాయి. ఇప్పటికే జ్యుయెలరీ, వస్త్రాలు, ఫ్యాషన్ (Fashion) రంగాలకు చెందిన కంపెనీలు రకరకాల యాడ్స్ తో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నో బిందీ- నో బిజినెస్ హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండింగ్‌లోకి వస్తోంది.

గతంలో పలు కంపెనీల సేల్స్ ను ఈ హ్యాష్ ట్యాగ్ దెబ్బ తీసింది. ఈ హ్యాష్ ట్యాగ్ దెబ్బకు పలు కంపెనీలు తమ యాడ్స్ ను పూర్తిగా మార్చి వేశాయి. తాజగా ఈ హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండింగ్‌లోకి వస్తుండటంతో వ్యాపార సంస్థలు జాగ్రత్త పడుతున్నాయి. ఆ హ్యాష్ ట్యాగ్ కు అనుకూలంగా తమ కంపెనీ యాడ్స్ ను రూపొందిస్తున్నాయి. ఇంతకి ఈ ‘నో బిందీ- నో బిజినెస్’ హ్యాష్ ట్యాగ్ ఏంటి…!

‘నో బిందీ- నో బిజినెస్’ అనే హ్యాష్ ట్యాగ్ ను ప్రముఖ కాలమిస్ట్, రచయిత షెఫాలీ వైద్య రెండేండ్ల క్రితం ప్రారంభించారు. దీపావళి, దసరా లాంటి హిందు పండుగల సందర్భంగా పలు వ్యాపార సంస్థలు మోడల్స్ తో పలు యాడ్స్ ను రూపొందించి తమ ఉత్పత్తులను భారీగా మార్కెటింగ్ చేసుకుని డబ్బులు దండుకున్నాయి. కానీ హిందువుల పండుగలకు చేసే యాడ్స్ లో హిందు సంప్రదాయ దుస్తులు ధరించక పోవడం, మోడల్స్ బొట్టు బిళ్లలు పెట్టుకోకుండా పాశ్చాత్య సంస్కృతిని ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ‘నో బిందీ నో బిజినెస్- హ్యాష్ ట్యాగ్’ తీసుకు వచ్చారు.

హిందువుల పండుగల సందర్బంలో చాలా కంపెనీల యాడ్స్ లో మోడల్స్ బొట్టు బిళ్లలు ధరించడం లేదు. ఆ యాడ్స్ పాశ్చాత్య కల్చర్ ను ప్రమోట్ చేసేలా ఉండటంతో బొట్టు బిళ్లలు ధరించని మోడల్స్ కు సంబంధించిన ఉత్పత్తులను హిందువులు వాడ వద్దని షెఫాలీ వైద్య పిలుపు నిచ్చారు. ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీంతో చాలా మంది హిందువులు ‘నో బిండి- నో బిజినెస్’ అని అన్నారు.

అంతకు ముందు తనిష్క్ జ్యుయెల్లరీ నటించిన యాడ్ పై ఈ హ్యాష్ ట్యాగ్ తీవ్ర ప్రభావం చూపింది. ఆ నగల సంస్థ యాడ్ లో మోడల్ బొట్టు బిళ్ల లేకుండా నటించారు. దీంతో హిందువులంతా తనిష్క్ జ్యుయెల్లరీ నగలను వాడేందుకు నో చెప్పారు. సంస్థ సేల్స్ బాగా పడి పోయాయి. దీంతో సదరు సంస్థ దిగి వచ్చి యాడ్ చేంజ్ చేసింది. ఆ తర్వాత పలు సంస్థలు కూడా తమ యాడ్స్ లో మార్పులు చేశాయి.

You may also like

Leave a Comment