చాలామందికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఒక మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే క్రికెట్ కి సంబంధించి చాలా విషయాలు మనకి తెలిసి ఉండవు. కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడైనా తెలిస్తే.. ఓహో.. దీని వెనుక ఇంత పెద్ద కారణం ఉందా అని అనుకుంటూ ఉంటాము. అయితే క్రికెటర్ల జెర్సీ నెంబర్లకు సంబంధించి కూడా చాలా మందికి కొన్ని విషయాలు తెలియవు. ఆ విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. క్రికెటర్లకి జెర్సీ నెంబర్లను ఇస్తూ ఉంటారు. అయితే ఈ జెర్సీ నెంబర్లను ఎలా కేటాయిస్తూ ఉంటారు..? ఒక ఆటగాడి కి ఉండే జెర్సీ నెంబర్ వెనుక కారణం ఏంటి..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదాహరణకి విరాట్ కోహ్లీని చూసినట్లయితే 18 ఆయన జెర్సీ నెంబర్. ధోని జెర్సీ నెంబర్ 7 ఇలా ఒక్కొక్క ఆటగాడి జెర్సీ నెంబర్ వేరుగా ఉంటుంది. ఇక ఈ జెర్సీ నెంబర్లను ఎలా పెడతారు అనే విషయానికి వస్తే.. ఈ నెంబర్లని ఆటగాళ్ళే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఎవరు కూడా అసైన్ చేయరు. ప్లేయర్లే పెట్టుకుంటారు. అయితే ఈ నెంబర్లు వెనుక ఎవరి ప్రమేయం కూడా ఉండదు. ఆటగాళ్ళే సొంతంగా పెట్టుకుంటారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండాలి.
Also read:
ఏ ఇద్దరికీ ఒకే అంకె వుండకూడదు. ఎక్కువగా లక్కీ నంబర్లు, సెంటిమెంట్లు, విజయాల ఆధారంగా నెంబర్లను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. టెండూల్కర్ లక్కీ నెంబర్ పది. పైగా టెండూల్కర్ లో 10 అని ఉంటుంది. కాబట్టి జెర్సీ నెంబర్ గా 10 ని ఎంపిక చేసుకున్నాడు. అలానే జూలై 7 ధోని పుట్టిన తేదీ. కాబట్టి ఏడుని జెర్సీ నెంబర్ కింద పెట్టుకున్నారు. ఒకసారి ఒక జెర్సీ నెంబర్ ని ఎంపిక చేసుకున్నాక, ఎప్పటికీ అదే నెంబర్ ఉంచాలని రూలేమీ లేదు ఎప్పుడైనా మార్చుకోవచ్చు.