Telugu News » Gaza Strip: గాజాలో ఆస్పత్రిపై దాడి… 500 మంది మృతి….!

Gaza Strip: గాజాలో ఆస్పత్రిపై దాడి… 500 మంది మృతి….!

తాజాగా గాజా స్ట్రిప్ లోని ఓ ఆస్పత్రి భవనంపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 500 మంది వరకు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

by Ramu

ఇజ్రాయెల్ (Israel)- హమాస్ మధ్య యుద్ధం భీకర రూపాన్ని దాల్చుతోంది. హమాస్ మిలిటెంట్ల ఏరివేత లక్ష్యంగా గాజా స్ట్రిప్ పై (Gaza Strip) ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ (Air Strikes ) చేస్తోంది. తాజాగా గాజా స్ట్రిప్ లోని ఓ ఆస్పత్రి భవనంపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 500 మంది వరకు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

 

శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్టు హమాస్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ చేసిందని ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. ఇజ్రాయెల్ మీదకకు ఇస్లామిక్ జిహాదీ ఉగ్ర సంస్థ రాకెట్ లాంఛర్లను ప్రయోగించిందని పేర్కొంది.

కానీ అవి విఫలం అవడంతో దిశ మార్చుకుని ఆస్పత్రిపై పడ్డాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధి డేనియల్ హగారీ వెల్లడించారు. గాజాలోని ఆస్పత్రి సమీపంలో తమ సైన్యం ఎలాంటి ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టలేదని ఆయన స్పష్టం చేశారు. దాడికి వాడిన రాకెట్లు పరిశీలిస్తే అవి తమ సైన్యం వాడిన ఎక్విప్ మెంట్స్ తో సరిపోలడం లేదన్నారు.

గాజాపై జరిగిన దాడి ముమ్మాటికే ఇజ్రాయెల్ సైన్యం పనే అని ఇస్లామిక్ జిహాది సంస్థ ఆరోపించింది. ఇది ఇలా వుంటే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఈ రోజు ఇజ్రాయెల్, జోర్డాన్ దేశాల్లో పర్యటించనున్నారు. హమాస్ మిలిటెంట్ల ఏరివేతలో ఇజ్రాయెల్ కు మద్దతు పలకడం, గాజాకు మానవతా సహాయం అందించే విషయంలో ఇజ్రాయెల్ తో బైడెన్ చర్చించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో దాడి జరగడం

 

You may also like

Leave a Comment