భక్తులకు (Devotees) పూజలు (Puja)అనేవి జీవితంలో భాగం. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన రోజులలో చేసే పూజలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని పండితులు చెబుతారు. అలాంటి వాటిలో నవరాత్రులు (Navratri) కూడా ప్రత్యేకమైనవిగా తెలిపారు. అందుకే తొమ్మిది రోజులు అమ్మవారిని చాలా నిష్టగా, భక్తి శ్రద్దలతో పూజిస్తారు.. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది అవతారాలలో దర్శనం ఇస్తారు.. కాగా నవరాత్రి రోజుల్లో చేసే ప్రత్యేక హోమాలు, పూజలు, వ్రతాల వల్ల దేవుడి అనుగ్రహం కలుగుతుందని, పండితులు చెబుతున్నారు.. అయితే ఈ నవరాత్రి రోజుల్లో ఏ హోమం చేయడం వల్ల.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
నవరాత్రి రోజుల్లో మహాగణపతి (Mahaganapati) హోమం చేయడం ద్వారా కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుందని, అలాగే ఆరోగ్యం, వ్యాపారంలో విజయం సాధించడం జరుగుతుందని పండితులు తెలుపుతున్నారు. ఆనందంతో కూడిన కుటుంబ జీవితం.. ఆత్మబలం.. విశ్వాసం, ఉత్సాహం మొదలగునవి సిద్దించాలంటే దశమహావిద్యా (Dasamahavidya)హోమం చేయమంటున్నారు.. శ్రీవిద్యా హోమం చేయడం వల్ల విద్యలో ఉత్తమంగా రానిస్తారు. పురుష సూక్త హోమం చేస్తే, జీవితంలో విజయం, పిల్లల్లో ఉన్నతి, సంపద చేకూరుతాయని అంటున్నారు.
శ్రీసూక్త హోమం.. ఈ శ్రీసూక్తానికి అధిపతి మహాలక్ష్మీదేవి కావున ఈ హోమాన్ని చేయడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. కాళీ హోమం.. సాధారణంగా ఈ హోమాన్ని చేయడం వల్ల శత్రువుల నుండి రక్షణ కలుగుతోంది. ఇకపోతే నవరాత్రుల్లో లలితా సహస్రనామ హోమం చేయించడం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లలితా త్రిశతి హోమం.. ఈ హోమం చేయడం వల్ల, ఆత్మ బలం, జీవితంలో నమ్మకం, ఉత్సాహం కలుగుతాయి. భువనేశ్వరి హోమం.. ఈ హోమం వల్ల ఆరోగ్యం, కుటుంబంలో ఆనందం ఉంటాయని పండితులు తెలుపుతున్నారు. అయితే సందర్భాన్ని హోమాలు చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు..