జార్ఖండ్ (Jharkhand) మాజీ ముఖ్య మంత్రి రఘుబర్ దాస్ (Raghubar Das)ను ఒడిశా గవర్నర్ గా నియమించింది. మరోవైపు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్ర సేనా రెడ్డి (Indrasena Reddy) ని త్రిపురకు గవర్నర్ గా నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇరువురు గవర్నర్లు తమ కార్యాలయాల్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి నియామకాలు అమలులోకి వచ్చే ఆదేశాలు జారీ చేస్తున్నట్టు రాష్ట్రపతి ప్రకటనలో వెల్లడించారు. రఘుబర్ దాస్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షునిగా పని చేస్తున్నారు. 2014 నుంచి 19 వరకు జార్ఖండ్ సీఎంగా ఆయన పని చేశారు.
ఇక నల్లు ఇంద్ర సేనా రెడ్డి 1983,1985,1999లలో మూడు సార్లు మలక్ పేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1989, 1994లలో వరుసగా రెండు సార్లు పరాజయం పాలయ్యారు. 1999లో ఉమ్మడి ఏపీలో బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఆయన పని చేశారు. 2003-07 మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా వున్నారు.
2014లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, 2020లో బీజేపీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా పని చేశారు. ఆ తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడి పోయారు. 2014లో భువనగిరి ఎంపీ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తాజాగా త్రిపుర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య స్థానంలో ఆయన్ని నియమించారు.