దేశంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. భూకంపములు (Earthquake) సంభవించినప్పుడు భూమి ఉపరితలం నందు ప్రకంపనలే కాకుండా కొన్ని సందర్భములలో భూమి విచ్ఛిన్నం కూడా అవుతుంది.
ఒక పెద్ద భూప్రకంపనం సముద్రము వద్ద సంభవించినపుడు సముద్ర గర్బము విచ్ఛిన్నమై సునామీ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. భూకంపంతో వచ్చు కదలికల వల్ల రాళ్ళు, మట్టి దొర్లి కొన్ని సందర్భాలలో అగ్నిపర్వతములా మారే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే నేపాల్ (Nepal)లో మళ్లీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.24 గంటలకు ఈ భూకంపం చోటుచేసుకుంది.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. నేపాల్ రాజధాని ఖాట్మండు (Kathmandu)కు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. కాగా, ఈ నెల తొలి వారంలో కూడా నేపాల్‌ను వరుస భూకంపాలు గడగడలాడించాయి. కేవలం అరగంట వ్యవధిలో ఐదుసార్లు భూమి కంపించి నేపాల్‌లో పెను విషాదం నింపింది.
తీవ్ర భూకంపాల ధాటికి నేపాల్‌లో పలు భవనాలు కుప్పకూలాయి. మృతుల సంఖ్య 3,600 దాటింది. వేల మంది గాయపడ్డారు. ఆ విషాద ఛాయలు ఇంకా వీడక ముందే మళ్లీ భూకంపం చోటుచేసుకోవడం నేపాలీలను ఆందోళనకు గురిచేస్తోంది.