రెడ్ బర్డ్ అకాడమీకి చెందిన టెక్నామ్ ఎయిర్‌క్రాఫ్ట్ VT-RBTలో సాంకేతిక లోపం తలెత్తింది.. ఈ విషయాన్ని గుర్తించిన ట్రెయినర్ ఎయిర్‌క్రాఫ్ట్ ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కానీ ఎయిర్‌క్రాఫ్ట్ వేగం అదుపు కాకపోవడం వల్ల.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) సమయంలో అది తిరగబడింది. ఆదివారం ఉదయం మహారాష్ట్ర (Maharashtra)లోని బారామతి (Baramati) ఎయిర్‌ఫీల్డ్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించిన సమాచారం ప్రకారం.. రెడ్ బర్డ్ అకాడమీకి చెందిన శిక్షణ ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తగానే ట్రెయినర్ గుర్తించారు. వెను వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండవగానే వేగం అదుపుకాక తిరగబడింది.
అయితే ఈ ఘటన నుంచి ట్రెయినర్, ట్రెయినీ ఇద్దరూ ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డారు. కాగా ఎయిర్‌క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మరోవైపు దర్యాప్తు పూర్తయితే గాని ఘటనకు సంబంధించిన కారణం ఏంటో తెలుస్తుందని ఏవియేషన్ అధికారులు తెలిపారు.