ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవడం చూస్తున్నాం.. రహదారులు రక్తంతో తడిసిపోతున్నాయి. నిర్లక్ష్యం ఎవరిది అయినా ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలు బజారున పడుతున్నాయి.. గమ్యాన్ని త్వరగా చేరుకోవాలన్న ఆతృత, నిద్రలేమి వంటి మొదలగు కారణాలు ప్రమాదానికి దారితీస్తున్నాయని అంటున్నారు.
ఇక తమిళనాడు (Tamil Nadu)లో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏడుగురు మరణించగా (died).. పలువురు గాయపడ్డారు (injured). ఓ ప్రభుత్వ బస్సును టాటా సుమో ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.. కాగా ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. కానీ వీరంతా దైవ దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది..