126
తిరుమల (Tirumala) తిరుపతి (Tirupati) దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. జనవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేస్తున్నట్టు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. భక్తులకు సులువుగా శ్రీవారి దర్శనం అయ్యేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ప్రతి నెల టీటీడీ విడుదల చేస్తుంది.
ఇందులో భాగంగా 2024 జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఈ రోజు ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. మరోవైపు జనవరి నెలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్న భక్తులు టీటీడీకి చెందిన ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ లో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. దళారులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో వారు వీరు చెప్పే మాటలు విని మోసపోవద్దని సూచించింది..