Telugu News » Srilanka: శ్రీలంక కీలక నిర్ణయం…. ఆ ఏడు దేశాల పర్యాటకులకు వీసా లేకుండా ఫ్రీ ఎంట్రీ….!

Srilanka: శ్రీలంక కీలక నిర్ణయం…. ఆ ఏడు దేశాల పర్యాటకులకు వీసా లేకుండా ఫ్రీ ఎంట్రీ….!

పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది.

by Ramu

శ్రీలంక (Srilanka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్ లాంట్ దేశాలకు చెందిన పర్యాటకులకు వీసాలు (Visa)లేకుండానే దేశంలోకి అనుమతించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నిర్ణయం నేటి నుంచి అమలులోకి వస్తుందని శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రి ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ నిర్ణయం అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్ నుంచి 30 వేల మంది పర్యాటకులు శ్రీలంకలో సందర్శించారని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.

భారత్ తర్వాత చెనా నుంచి అత్యధికంగా 8,000 మంది పర్యాటకులు శ్రీలంకు సందర్శించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో రాబోయే రోజుల్లో శ్రీలంకను సందర్శించే పర్యాటకుల సంఖ్య 50 లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు కేబినెట్ వెల్లడించింది.

ఇక శ్రీలంక ప్రధానంగా పర్యాటక రంగంపై ఆధారపడుతోంది. దేశ జీడీపీలో అత్యధిక ఆదాయం పర్యాటక పరిశ్రమ నుంచి వస్తోంది. కానీ ఇటీవల కాలంలో కొవిడ్ మహమ్మారి సంక్షోభం, ఆ తర్వాత దేశంలో ఆర్థిక సంక్షోభం, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంకను సమస్యలు చుట్టు ముట్టాయి. ఈ క్రమంలో ఆ పరిస్థితుల నుంచి కోలుకునేందుకు పర్యాటక రంగానికి తిరిగి ఊపిరి పోయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది.

You may also like

Leave a Comment