భారత స్వాతంత్య్ర చరిత్రలో విప్లవ పోరాటాల గురించి చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు భగత్ సింగ్ (Bagath Singh). ఆ తర్వాత చంద్ర శేఖర్ ఆజాద్. వారిద్దరూ వలస పాలనకు వ్యతిరేకంగా అలు పెరుగని పోరాటం చేశారు. కానీ ఆ పోరాటంంలో వారితో పాటు అసువులు బాసిన ఇంకెంతో మంది ఇప్పటికీ చరిత్రలో అజ్ఞాన వ్యక్తులుగా మిగిలి పోయారు. అలాంటి వ్యక్తుల్లో రాం ప్రసాద్ బిస్మిల్ (Ramprasad Bismil) ఒకరు.
రాం ప్రసాద్ బిస్మిల్… రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన 1897 జూన్ 11న బ్రిటీష్ ఇండియాలో షాజహాన్ పూర్ లో జన్మించారు. మొదట్లో ఆర్య సమాజంలో పని చేసిన ఆ తర్వాత విప్లవ పోరాటల వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత మాతృ వేది అనే రహస్య విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేశారు.
సంఘం తరఫున యువతను అంతా ఒక్క తాటి పైకి తెచ్చి వలస పాలనకు ఎదురు తిరిగాడు. మణిపూర్ కీ ప్రతిజ్ఞ పేరుతో పద్యాలు రాసి యువతలో పోరాట స్ఫూర్తిని రగిల్చారు. దేశ వాసియోకి నామ్ సందేశ్ పేరిట కరపత్రాలను పంచి పెట్టి బ్రిటిష్ పాలకులకు నిద్దుర లేకుండా చేశారు. భగత్ సింగ్ తో కలిసి హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది పోరాట యోధులను తీర్చి దిద్దారు.
ఇక ఆయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే మరో ఘటన కకోరి కుట్ర కేసు. 09 అగస్టు 1925లో షహరాన్ పూర్- లక్నో ప్యాసింజర్ పై విప్లవ కారులు దాడి చేశారు. ఈ ఘటనలో సుమారు 40 మంది విప్లవ కారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అశ్వఖుల్లా ఖాన్, రోషన్ సింగ్, రాజేంద్ర నాథ్ లాహిరిలతో పాటు రాం ప్రసాద్ బిస్మిల్ కు బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది.