రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో లంచం (Bribe) తీసుకుంటు తీసుకుంటూ ఇద్దరు అధికారులు బుక్కయ్యారు. శంషాబాద్ మండలం నర్కూడలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇంటి అనుమతుల కోసం లంచం తీసుకుంటుడగా నర్కూడ గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసింహ, బిల్ కలెక్టర్ నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నర్కూడ పరిధిలోని మధు అనే వ్యక్తి అమ్మపల్లి గ్రామం దగ్గర ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఈ మేరకు ఇంటి నిర్మాణపు అనుమతల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో జనవరి 2న సెక్రటరీ లక్ష్మీ నరసింహ, బిల్ కలెక్టర్ నాగరాజులను బాధితుడు మధు కలిశారు. అనుమతులు ఇచ్చేందుకు రూ. 65,000 ఇవ్వాలని మధును డిమాండ్ చేశారు.
అంత డబ్బు తాను ఇవ్వలేనని, కాస్త తగ్గించాలని అధికారులను మధు కోరాడు. దీంతో చివరకు 45 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో మధు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు గ్రామపంచాయతీ వద్దకు వచ్చి డబ్బులు చెల్లించాలని బిల్ కలెక్టర్ నాగరాజు చెప్పడంతో మధు అక్కడకు చేరుకున్నారు.
కానీ అంతకన్నా ముందే ఏసీబీ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మాటు వేశారు. బాధితుడు మధు నుంచి బిల్ కలెక్టర్ నాగరాజు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో పాటు సెక్రటరీ లక్స్మీ నరసింహను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వారిని రేపు ఉదయం నాం పల్లి కోర్టులో హాజరు పరచనున్నట్టు చెప్పారు.