ఉపేంద్ర(Upendra)…దక్షిణాది సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటుడు.అంతకు మించిన గొప్ప దర్శకుడు. సినీ రంగంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేస్తూ…కల్ట్ క్రియేటివ్, క్వశ్చనింగ్ హీరోగా ప్రేక్షకులకు చేరువయ్యారు. 2018లో ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ (Best democratic party)ని స్థాపించారు.
అయితే శనివారం తన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉపేంద్ర సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు గాను ఓ సామాజికవర్గం నుంచి తీవ్రవ్యతిరేకత ఎదురైంది.దీనిపై సంబంధింత సామాజిక వర్గ సభ్యులు ఉపేంద్రపై ఫిర్యాదు చేశారు.
స్పందించిన స్థానిక ‘చెన్నమ్మన కెరె అచ్చుకట్టు (Chennammana Kere Ukhakattu)’ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ వివాదానికి దారి తీసిన వ్యాఖ్యలపై స్పందించిన నటుడు ఉపేంద్ర సంబంధిత వర్గ ప్రజలను క్షమాపణలు కోరారు.
“ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లైవ్లో నేను ఉపయోగించిన సామెత వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసింది. దీంతో వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియా(Social media) నుంచి తొలగించాను. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. జరిగిందానికి క్షమాపణలు కోరుతున్నాను” అని ఉపేంద్ర అన్నారు. కాగా 2017లో ఉపేంద్ర రాజకీయల్లోకి ప్రవేశించారు.
ఆయన మొదటగా ‘కర్ణాటక ప్రజ్ఞవంత జనతా పక్ష పార్టీ’ లో చేరారు. అనంతరం కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని వీడారు. 2018లో స్వయంగా ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ ని స్థాపించారు.
కాగా ఉపేంద్ర చాలా రోజుల నుంచి సరైన హిట్ అందుకోలేకపోయారు..రీసెంట్గా ‘కబ్జా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా తెలుగు ఆడియోన్స్ను అంతగా మెప్పించలేకపోయింది.