Telugu News » TS Intermediate Exam: ఇంటర్ పరీక్షలకు అంతా సిద్ధం.. సీసీ కెమెరాలతో నిఘా..!

TS Intermediate Exam: ఇంటర్ పరీక్షలకు అంతా సిద్ధం.. సీసీ కెమెరాలతో నిఘా..!

ఇంటర్మీడియట్ పరీక్షలు(Intermediate Exams) రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశా

by Mano
TS Intermediate Exam: Everything is ready for intermediate exams.. surveillance with CC cameras..!

ఇంటర్మీడియట్ పరీక్షలు(Intermediate Exams) రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రెండు దశల్లో ప్రాక్టికల్స్, పర్యావరణ విద్య పరీక్షలు పూర్తి కాగా వార్షిక పరీక్షలు(Final Exams) మార్చి 28 నుంచి 19 వరకు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు.

TS Intermediate Exam: Everything is ready for intermediate exams.. surveillance with CC cameras..!

పరీక్షలు ఈ నెల 28న ప్రారంభమై మార్చి 19న ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఉదయం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఉదయం 9 గంటల తర్వాత అనుమతించరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వరంగ మోడల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, గిరిజన గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాలతో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్ట్మెంటల్ అధికారిని నియమించారు. ఈ పరీక్షల కోసం దాదాపు 700మంది ఇన్విజిలేటర్లను నియమించారు.

సీసీ కెమెరాల నిఘాలో ప్రత్యేక అధికారులు పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు ప్రశ్నపత్రాలను విడుదల చేస్తారు. జిల్లాకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ టీమ్‌లు, ఐదు కస్టోడియన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని పోలీసు శాఖ ఆదేశించింది.

You may also like

Leave a Comment